వేటూరి ప్రభాకరశాస్త్రి
87
అను పేరఁ బ్రకటించిన యాక్షేపవ్యాసమునకు సమాధాన మీ క్రిందిది. తొలుత వారి యాక్షేపములఁ జూపి నా సమాధాన మటుపైఁ జెప్పుదును.
ఆహివెట్టు
ఆక్షేపము.
"ఆహివెట్టితి జొన్నగడ్డాగ్రహార
వృత్తి యేనూఱురూకల"[1] వృత్తమునకు - (క్రీడాభిరామము - పొ. 80)
ఇందు 'ఆహివెట్టు=తాకట్టు పెట్టు' అని శ్రీశాస్త్రిగారు (పీఠిక పొ, 123) అర్ధము వ్రాసినారు. 80 పొరటలో మూలమునఁ గూడ నిట్లే యున్నది. కాని 'ఆహివెట్టు' అను పదమే యెక్కడను గాన్పింపదు. కావున నిట 'ఆధివెట్టు' అని యుండవలయును. ఆధిశబ్దమునకుఁ దాకట్టు అనునర్థము గలదు.
ఈ క్రింది ప్రయోగములోఁగూడ 'ఆధివెట్టు' పదము గలదు.
'గ్రహణసంక్రమణాదుల రాచనగరఁ
గాసువీసంబు వెడలమి గ్రాసమునకు
నాధివెట్టిరి క్షేత్రంబులందుఁ గొన్ని
లెస్స యుండునె గృహభర్త లేని బ్రతుకు'
(మనుచరిత్ర -3-34)”
దీనికి నేఁ జెప్పు సమాధాన మిది.
నిఘంటువులలో ఏకమాత్ర ప్రయోగముతో ఎన్నో పదములు పరిగృహీతము లయినవి.
వ్రాఁతప్రతిలో నున్న "ఆహివెట్టు” ప్రయోగము సరికా దన్న యపనమ్మకము నాకు లేదు కాన దానిని నే దిద్దలేదు. 'ధి ఆ' పద మొకటి 'తాకట్టు ' అర్ధము గలది ఉన్నంతమాత్రాన 'ఆహి' ఉండ దనవచ్చునా?
గౌరన హరిశ్చంద్రోపాఖ్యానమున ఎల్లవ్రాఁతప్రతులలో 'ఆహికంబులు వెట్టి' అన్న ప్రయోగము గానవచ్చు చున్నది. 'ఆహికంబులు- ↑ 'రూకలవృత్తమునకు' - అని వ్రాతప్రతిలో నున్నది. అట్లే ముద్రించితిని. "ఏనూఱురూకల విత్తమునకు” అని దిద్దిన సముచితముగా నుండు ననుకొందును. . వే. ప్ర