Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

85

(?) యున్నది. ఎడమవెనుకటిచేత త్రిశూలమున్నది. నాల్గుచేతులకు మూఁడేసి కంకణములున్నవి. మెడలో కంటె హారము నున్నవి. పాదములకుఁ బాజేబు లున్నవి. పీఠమునకు దిగువను వరాహ మున్నది. కాకతీయకులదైవత మిట్లు దొరకుట నాకుఁ జాల వేడ్కఁ గొల్పినది. ఈ కాకతమ్మ యేకశిలానగరమున నేకవీరాదేవికి సైదోడుగా వెలసియుండిన దని క్రీడాభిరామమునఁ గలదు. ఆ దేవాలయము, విగ్రహము, నగరము, రాజ్యము నన్నియు నంతరించిపోయినవి గదా! ఏకవీరాదేవివిగ్రహమును గూర్చియు జాయసేనాపతివిగ్రహమునుగూర్చియు వేర్వేఱుగా వ్యాసములను విగ్రహములతోఁ బ్రకటింతును.

ముక్త్యాలప్రాంతములలో ఏకవీర, మాహురమ్మ, కాకతమ్మలుగా గుర్తింపఁదగిన విగ్రహములు మఱికొన్ని నే సేకరించిన వానిలో నున్నవి. అందులో వింత గొలుపు విగ్రహ మింకొకటి యున్నది. అది ప్రాయికముగాఁ బండ్రెండు పదుమూఁడు శతాబ్దుల దయి యుండును. ఒక తురుష్కవీరుఁడు బల్లెమును చేబూని ఒక యేనుఁగుతో పోరాడుచున్నాఁడు. ఏనుఁగుమీద నిద్దఱు వ్యక్తులున్నారు. ఒకరు కాకతీయ సేనాని జాయసేనాపతియో యేమో:

2.దవనపున్నమ


వసన్తకాలతృప్త్యర్థం తత్సమృద్ధిభి రాహృతైః
పుష్పై రానావిధై ర్దేవ మర్చయే దక్షిణాముఖమ్
ఆసీనం మణ్డపేక్లప్తే వేదీమధ్యే మనోరమే
ఉద్యానే మందిరే వాపి కృత్రిమోద్యానశోభితే
నద్యాదౌ వా యథా యోగం ఫలపుష్పోదకాన్వితే -

దమనకోత్సవః



పౌర్ణమాస్యాం తీథౌ తస్మిన్ మాసే దమనికాదళైః
పుష్పాన్వితైః ప్రపాం కృత్వా మణ్డపే పూజయే ద్ధరిమ్
పుష్పై ర్ధమనికాభిశ్చ సర్వాలంకార మాచరేత్
ఉత్సవ శ్చ భవే తస్మిన్ హోమో దమనికాదళైః
వైశాఖే మాసి వా కుర్యా ద్వసన్తోత్సవ మబ్జజ