పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4/G94



(సి) సంబంధిత లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ నుండి మరియు ప్రభావము నకు గురికాగల లేదా ప్రభావితమైన వ్యక్తుల సలహాలు మరియు అభ్యంతరములను, పర్యాలోచించవలెను;

భాగము - 13.

బొర్డు యొక్క పునర్వ్యవస్థీకరణ.

131.(1) ఈ చట్టపు ఉద్దేశాలు మరియు ప్రయోజనముల అమలుకొరకు రాజ్య ప్రభుత్వము చే తయారు చేయబడిన బదలాయింపు పథకము ప్రచురించిన తేదీ నుండి లేదా రాజ్య ప్రభుత్వముచే నియతమైనట్టి తదుపరి తేదీ నుండి (ఇందుమీదట ఈ భాగములో అమలు తేదీగా నిర్దేశించబడు) రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డుకు (ఇందుమీదట బోర్డు నిర్దేశించబడు) చెందిన అమలులేదీకి అవ్యవహితపూర్వము ఏదేని ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములు రాజ్య ప్రభుత్వము మరియు బోర్డు మధ్య సమ్మతించబడునట్టి నిబంధనలపై రాజ్య ప్రభుత్వములో నిహితమైన ఉండవలెను.

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వములో నిహితమైయున్న ఏదేని ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములను ప్రచురించబడిన బదలాయింపు పధకము ప్రకారం అట్టి పథకములో నిర్ణయపరచబడునట్టి రాజ్యప్రభుత్వము యొక్క ఇతర ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములతో పాటుగా రాజ్య ప్రభుత్వము మరియు రాజ్య ప్రసార వినియోగము లేదా ఉత్పాదక కంపెనీ లేదా ప్రసార లైసెన్సుదారు లేదా సందర్భానుసారంగా పంపిణీ లైసెన్సుదారుగా ఉన్నట్టి కంపెనీ లేదా కం పెనీల మధ్య సమ్మతించబడినట్టి నిబంధనలు మరియు షరతుల పై రాజ్యప్రభుత్వముచే ప్రభుత్వ కంపెనీ లేదా కంపెనీ లేదా కం పెనీలలో తిరిగి నిహితము చేయవలెను.

అయితే, దీని క్రింద అంతరణ అయిన ఏవేనీ సంపత్తుల అంతరణ విలువను సాధ్యమైనంత వరకు రాజ్య ప్రభుత్వము మరియు రాజ్య ప్రసార వినియోగము లేదా ఉత్పాదక కంపెనీ లేదా ప్రసార లైసెన్సుదారు లేదా సందర్భానుసారంగా పంపిణీ లైసెన్సుదారుకు మధ్య సమ్మతించబడినట్టి నిబంధనలు మరియు షరతుల వద్ద అట్టి సంపత్తుల ఆదాయ సామర్థ్యం పై ఆధారపడి నిర్ధారింపబడవలెను.

(3) ఈ పరిచ్చేదములో ఏమి ఉన్నప్పటికిని,-

(ఎ) అంతరణ పథకములో ఎవరేని వ్యక్తికి లేదా రాజ్య ప్రభుత్వముచే పూర్తిగా అధీనము చేసుకొనని సంస్థకి ఏదేని ఆస్తి లేదా హక్కుల అంతరణ ప్రమేయము ఉన్న యెడల, రాజ్య ప్రభుత్వమునకు అంతరణ స్వీకర్త చెల్లించవలసియున్న న్యాయమైన సముచిత విలువ కొరకు మాత్రమైన అంతరణకి ప్రభావము కలిగియుండవలెను.