పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

....88/G88 (2) ఎవరేని పక్షకారులు దరఖాస్తు పై మరియు పక్షకారులకు నోటీసు ఇచ్చిన పిమ్మట మరియు అతను ఆకర్ణింపబడుటకు కోరినచో అటువంటి వారిని ఆకర్ణింపబడిన పిమ్మట లేక తనంతట తానుగా అట్టి నోటీసు లేకుండా, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ ఒక బెంచీ సమక్షముననున్న ఏదేని కేసు పరిష్కరింపబడుటకు, ఏదేని. ఇతర బెంచీకి బదిలీ చేయవచ్చును.

123. ఇద్దరు సభ్యులు కూడిన బెంచీలోని (న్యాయ పీఠములలోని) అపీలు ట్రిబ్యునలు సభ్యులు ఏదేని అంశముపై ఏకీభవించని యెడల, వారు ఏకీభవించని అంశము లేక అంశములను తెలియజేయపలెను. మరియు దానిని అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ కు నిర్దేశించవలెను. మరియు అతను ఆ అంశము లేక అంశములను ఆకర్ణించుటగాని లేక ఆ విషయమును ఆకర్ణించుటకు అట్టి అంశము లేక అంశములను ఒకటి లేక అంతకంటే ఎక్కువ మంది అపీలు ట్రిబ్యునలు ఇతర సభ్యులకు నిర్దేశించవలెను మరియు అట్టి అంశము లేక అంశములను మొదటి ఆకర్షించిన వారితో సహా ఆ విషయమును ఆకర్షించిన అపీలు ట్రిబ్యునలు సభ్యుల యొక్క మెజారిటీ అభిప్రాయము ప్రకారము నిర్ణయించవలెను.

124(1) ఈ చట్టము క్రింద అపీలు ట్రిబ్యునలుకు అపీలు చేసుకొను ఒక వ్యక్తి, స్వయముగాగాని లేక సందర్భానుసారము అపీలు ట్రిబ్యునలు సమక్షమున అతని కేసును విన్నవించుకొనుటకు అతని కోరిక పై న్యాయవాది సహాయమును పొందవలేను.

(2) సముచిత కమీషను ప్రిసెంటింగ్ అధికారులుగా వ్యవహరించుటకు ఒకరు లేక అంతకన్నా ఎక్కువ న్యాయవాదులకు లేక దాని యొక్క ఎవరేని అధికారులకు ప్రాధికారమీయ వచ్చును. మరియు అట్లు ప్రాధికార మీయబడిన ప్రతి వ్యక్తి సందర్భానుసారము అపిలేటు ట్రిబ్యునలు సమక్షముననున్న ఏదేని అపీలు విషయములో కేసును విన్నవించుకొనుటకు ప్రాధికార మీయవచ్చును.

125. అపీలు ట్రిబ్యునలు యొక్క ఏదేని నిర్ణయము లేక ఉత్తర్వు ద్వారా వ్యధితుడైన ఎవరేని వ్యక్తి సివిలు ప్రక్రియా స్మృతి, 1908 యొక్క 100వ పరిచ్చేదములో నిర్దిష్ట పరచిన ఏదేని ఒక లేక అంతకన్నా ఎక్కువ కారణాల పై అతనికి అపీలు ట్రిబ్యునలు నిర్ణయము లేక ఉత్తర్వు తెలియపరిచిన తేదీ నుండి అరువది దినముల లోపు సర్వోన్నత న్యాయస్థానములో అపీలు చేయవచ్చును.

అయితే సర్వోన్నత న్యాయస్థానము, సదరు కాలావధి లోపు అపీలు దాఖలు చేయుట నుండి అపీలుదారును నివారించుటకు తగిన కారణములు ఉన్నవని సంతృప్తి చెందినచో,అరువది దినములు మించకుండా అదనపు కాలావధి లోపు దాఖలు చేయుటకు అనుమతించవలెను.