పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

(జి) వ్యతిక్రమమైన వినతి పత్రమును త్రోసిపుచ్చుట లేక ఏకపక్షముగా నిర్ణయించుట;

(హెచ్) ఏదేని బర్తరఫు ఉత్తర్వును లేక ఏదేని వ్యతిక్రమమైన వినతి పత్రమును లేక ఏకపక్షముగా జారీచేసిన ఏదేని ఉత్తర్వును కొట్టివేయవచ్చును.

(ఐ) కేంద్రప్రభుత్వము ద్వారా విహితపరచబడు ఏదేని ఇతర విషయము.

(3) ఈ చట్టము క్రింద అపీలు ట్రిబ్యునలు ద్వారా చేసిన ఉత్తర్వు సివిలు న్యాయ స్థానపు డిక్రీగా అపీలు ట్రిబ్యునలుచే అమలుపరచదగి ఉండును. మరియు ఇందు నిమిత్తము అపీలేటు ట్రిబ్యునలు, సివిలు న్యాయస్థానము యొక్క అన్ని అధికారములను కలిగియుండును.

(4) ఉప-పరిచ్ఛేదము (3)లో ఏమి ఉన్నప్పటికినీ, అపీలు ట్రిబ్యునలు, స్థానిక అధికారితా పరిధి కలిగిన సివిలు న్యాయస్థానమునకు, తనచే చేయబడిన ఏదేని ఉత్తర్వును పంపవచ్చును. మరియు అట్టి సివిలు న్యాయస్థానము, ఆ న్యాయస్థానముచే చేయబడిన డిక్రీ వలె ఆ ఉత్తర్వును అమలు పరచవలెను.

(5) అపీలు ట్రిబ్యునలు సమక్షములోని ప్రొసీడింగులన్నియు భారత శిక్షా స్మృతి యొక్క 193 మరియు 228 పరిచ్ఛేదముల అర్థపరిధిలో న్యాయిక ప్రొసీడింగుగా భావించవలెను మరియు అపీలు ట్రిబ్యునలు, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 345 మరియు 346 పరిచ్ఛేదముల నిమిత్తము సివిలు న్యాయస్థానముగా భావించబడవలెను.

121. ఆపీలు ట్రిబ్యునలు, సముచిత కమీషను లేదా ఆయా సమయమునందు ఎవరేని హితము కలిగిన ఇతర పక్షకారు ఉన్నచో వారిని ఆకర్ణింపబడిన పిమ్మట ఈ చట్టము క్రింద దాని యొక్క శాసనపరమైన కృత్యములను నిర్వర్తించుట కొరకుగాను ఏదేని సముచిత కమీషనుకు అది సబబని భావించినట్టి ఉత్తర్వులను, అనుదేశములను లేదా ఆదేశములను జారీ చేయవచ్చును.

122.(1) బెంచీల (న్యాయపీఠములు) ఏర్పాటు జరిగినపుడు, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్, ఆయాసమయములందు, అధి సూచన ద్వారా బెంచీల (న్యాయపీఠములు) మధ్య అపీలు ట్రిబ్యునలు యొక్క కార్యకలాపాలను పంపిణీ చేయుటకు నిబంధనలు చేయవచ్చును మరియు ప్రతి బెంచీ (న్యాయపీఠము) వ్యవహరించవలసిన విషయాల కొరకు కూడా నిబంధనలు చేయవచ్చును.