పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 86/G86.. (2) అపీలు ట్రిబ్యునలు యొక్క ఛైర్ పర్సన్ గైరుహాజరు, అనారోగ్యము లేక ఏదేని ఇతర కారణముగా అతని కృత్యములను నిర్వర్తించలేనపుడు, అపీలు ట్రిబ్యునలు యొక్క అత్యంత సీనియరు సభ్యుడు, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ తన విధులకు హాజరగు తేదీ వరకు, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ యొక్క కృత్యములను అతను నిర్వర్తించవలెను.

119.(1) కేంద్ర ప్రభుత్వము, తాను సబబని భావించునట్టి అధికారులను మరియు ఇతర ఉద్యోగులను అపీలు ట్రిబ్యునలుకు ఏర్పాటు చేయవలెను.

(2) అపీలు ట్రిబ్యునలు యొక్క అధికారులు మరియు ఇతర ఉద్యోగులు, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ యొక్క సాధారణ అధీక్షణత క్రింద వారి కృత్యములను నిర్వర్తించ వలెను.

(3) అపీలు ట్రిబ్యునలు యొక్క అధికారులు మరియు ఇతర ఉద్యోగుల జీతములు మరియు బత్తెములు మరియు ఇతర సేవాషరతులు మరియు నిబంధనలు, కేంద్ర ప్రభుత్వము విహితపరచబడు నట్లుండవలెను.

120.(1) ఆపీలు ట్రిబ్యునలు, సివిలు ప్రక్రియా స్మృతి, 1908 ద్వారా నిబంధించబడిన ప్రక్రియకు కట్టుబడియుండదు, అయితే సహజసిద్ధ న్యాయ సూత్రములు మరియు ఈ చట్టపు నిబంధనలకు లోబడి మార్గదర్శకముగా నుండును మరియు అపీలు ట్రిబ్యునలు తన స్వంత ప్రక్రియను క్రమబద్ధీకరించుటకు అధికారములు కలిగియుండును.

(2) అపీలు ట్రిబ్యునలు, ఈ చట్టము క్రింద తన కృత్యములను నిర్వర్తించు ప్రయోజనాల నిమిత్తము, ఈ క్రింది వాటికి సంబంధించిన విషయాలలో, ఒక దావాను విచారించుచున్నపుడు, సివిలు ప్రక్రియా స్మృతి, 1908 క్రింద సివిలు న్యాయస్థానములో నిహితమైన అవే అధికారములను కలిగియుండును, అవేవనగా -

(ఎ) ఎవరేని వ్యక్తిని సమను చేయుటకు మరియు అతనిని తప్పనిసరిగా హాజరగు నట్లు చూచుటకు మరియు అతనిని ప్రమాణము పై పరీక్షించుటకు;

(బి) దస్తావేజులను వెల్లడించుట మరియు దాఖలు చేయమని కోరుట;

(సి) అఫిడవిట్లపై సాక్ష్యమును పొందుట;

(డి) భారతసాక్ష్య చట్టము, 1872 యొక్క 123 మరియు 124 పరిచ్ఛేదపు నిబంధనలకు లోబడి, ఏదేని కార్యాలయము నుండి ఏదేని పబ్లికు రికార్డును లేక దస్తావేజును లేక అట్టి రికార్డు లేక దస్తావేజు ప్రతిని అభ్యర్ధించుట;

(ఇ) సాక్ష్యులను లేక దస్తావేజులను పరీక్షించుటకై కమీషన్లను జారీచేయుట;

(ఎఫ్) తన నిర్ణయాలను పునర్విలోకనము చేయుట: -