పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 851685

115. అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ మరియు అషీలు ట్రిబ్యునలు యొక్క సభ్యులకు చెల్లించవలసిన జీతము మరియు బత్తెములు మరియు ఇతర సేవాషరతులు మరియు నిబంధనలు కేంద్ర ప్రభుత్వము ద్వారా విహితపరచబడునట్లుండవలెను.

అయితే, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్-పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుని జీతము నురియు బత్తెములుగాని, లేక ఇతర సేవా షరతులు లేక నిబంధనలు గాని, నియామకము జరిగిన పిమ్మట అతనికి అననుకూలముగా మార్చరాదు.

116. తాత్కాలిక గైరుహాజరు కానట్టి ఏదేని ఇతర కారణమున్నచో, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుని పదవిలో ఏదేని ఖాళీ ఏర్పడినపుడు, కేంద్ర ప్రభుత్వము, ఖాళీని భర్తీ చేయుటకు ఈ చట్టపు నిబంధనల ననుసరించి మరొక వ్యక్తిని నియమించవలెను మరియు ప్రొసీడింగులు, ఖాళీని భర్తీ చేసిన దశ నుండి అపీ లేటు ట్రిబ్యునలు సమక్షమున కొనసాగించవలెను.

117.(1) అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక ఆపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుడు, కేంద్ర ప్రభుత్వమునకు తన దస్తూరీతో వ్రాసియుంచిన నోటీసు ద్వారా తన పదవికి రాజీనామా చేయవచ్చును.

అయితే, అపీలు, ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుడు, కేంద్ర ప్రభుత్వము ద్వారా అనుమతి పొందిననే తప్ప, అట్టి నోటీసు అందిన తేదీ నుండి మూడు మాసములు ముగియు వరకు లేదా అతని పదవిలో అతని ఉత్తరాధికారిగా తగురీతిగా నియమించిన వ్యక్తి వచ్చునంత వరకు లేదా పదవి కాలావధి ముగియునంత వరకు, వీటిలో ఏది ముందయినచో దానికి వెంటనే పదవియందు కొనసాగుట నుండి వదులుకొనవచ్చును.

(2) అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ ను లేక అపీలు ట్రిబ్యునలు సభ్యుడిని, అట్టి నేరారోపణల విషయములో అపీలు ట్రిబ్యునలు యొక్క సంబంధిత చైర్ పర్సన్ లేక సభ్యునికి, అతని పై మోపబడిన నేరారోపణలను తెలియపరుస్తూ మరియు ఆకర్షింపబడుటకు తగిన అవకాశము నిచ్చిన సందర్భములో ఈ ప్రయోజనము నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము నియామకము చేయు సర్వోన్నత న్యాయస్థానము యొక్క న్యాయాధీశునిచే పరిశీలన జరుపబడిన పిమ్మట నిరూపించబడిన దుర్వర్తన లేక అసమర్థత కారణముగా, కేంద్ర ప్రభుత్వము ద్వారా, ఉత్తర్వు ఇవ్వబడిననే తప్ప, అతనిని పదవి నుండి తొలగించరాదు.

118. (1) మరణము, రాజీనామా లేక ఇతర కారణముగా అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ పదవిలో ఏదేని ఖాళీ ఏర్పడిన సందర్భములో, అపీలు ట్రిబ్యునలు యొక్క అత్యంత సీనియరు సభ్యుడు, అట్టి ఖాళీని పూరించుటకు ఈ చట్టపు నిబంధనల ననుసరించి నియమితుడైన నూతన చైర్ పర్సన్, అతను పదనిలో చేరు. తేదీ వరకు, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ గా వ్యవహరించవలెను.