పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

84/G84 (బి) అపీలు ట్రిబ్యునలు సభ్యుని విషయములో,-

(i) ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా ఉన్న, లేక ఉండియున్న లేక ఉండుటకు అర్హత కలిగిన; లేక

(ii) ఆర్ధిక వ్యవహారములు లేక విషయములు లేక మౌళిక సదుపాయములను నిర్వహించు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేక విభాగములో కనీసము ఒక సంవత్సరము వరకు కార్యదర్శిగా ఉన్న లేక ఉండియున్న; లేక

(iii) విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము మరియు పంపిణీ మరియు క్రమబద్ధీకరణ లేక ఆర్థికశాస్త్రము, వాణిజ్యశాస్త్రము, న్యాయశాస్త్రము, లేక మేనేజిమెంటులకు, సంబంధించిన విషయాలను నిర్వహించుటలో సామర్థ్యము, మరియు స్థాయి ఉండి, తగిన పరిజ్ఞానము లేక అనుభవము కలిగియున్న లేక ఉండియున్న ఒక వ్యక్తి, -

అయిననే తప్ప, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు సభ్యుడుగా నియమింపబడుటకు అర్హుడు కాడు.

(2) అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ ను భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన పిమ్మట కేంద్ర ప్రభుత్వము నియమించవలెను.

(3) అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యులను 78వ పరిచ్ఛేదములో నిర్దేశించిన ఎంపిక కమిటీ యొక్క సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వము నియమించవలెను.

(4) అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్-పర్సన్ లేక ఇతర సభ్యుని నియామకము కొరకు ఎవరేని వ్యక్తిని నియమించుటకు పూర్వము, కేంద్ర ప్రభుత్వము, అట్టి ఛైర్ పర్సన్ లేక సభ్యుడి, తన కృత్యములకు భంగము వాటిల్లునట్లుగా ఏదేని ఆర్ధిక లేక ఇతర హితము లేనట్టి వ్యక్తిగా ఉండునట్లు, తనంతటతాను సంతృప్తి చెందవలెను.

114. అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుడు, అతను పదవిలోకి వచ్చిన తేదీ నుండి మూడు సంవత్సరముల కాలావధి వరకు అట్లు పదవి యందు కొనసాగవలెను:

అయితే, అట్టి ఛైర్ పర్సన్ లేక సభ్యుడు మూడు సంవత్సరముల కాలావధికి రెండవసారి తిరిగి నియామకమున కై అర్హుడగును.

అంతేగాక, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ లేక సభ్యుడు,

(ఎ) అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ విషయములో, 70 సంవత్సరముల వయస్సు;

(బి) అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుని విషయములో 65 సంవత్సర ముల వయస్సు -

నిండిన తరువాత అట్లు పదవి యందు కొనసాగరాదు.