పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

83683 :

(2) ఈ చట్టపు నిబంధనలకు లోబడి, -

(న) అపీలు ట్రిబ్యునలు యొక్క అధికారితా పరిధిని వాటి యొక్క బెంచీలు (న్యాయ పీఠములు) వినియోగించవచ్చును;

(బి) అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్-పర్సన్ తాను సబబని భావించినచో, అపీలు ట్రిబ్యునలు యొక్క ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ సభ్యులతో అపీలు ట్రిబ్యునలు ఛైర్-పర్సన్ ద్వారా ఒక బెంచీని (న్యాయపీఠమును) ఏర్పాటు చేయవచ్చును.

అయితే ఈ ఖండము క్రింద ఏర్పాటైన ప్రతి బెంచీలో (న్యాయ పీఠములో) కనీసము ఒక న్యాయక సభ్యుడు మరియు ఒక సాంకేతిక సభ్యుడు, చేరి ఉండవలెను;

(సి) అపీలు ట్రిబ్యునలు బెంచీలు. (న్యాయపీఠములు), సాధారణముగా ఢిల్లీలో మరియు కేంద్ర ప్రభుత్వము, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ ను సంప్రదింపుతో, అధి సూచించిన అట్టి ఇతర స్థలములలో ఉపవిష్టుడగును.

(డి) కేంద్ర ప్రభుత్వము, అపీలు ట్రిబ్యు లు యొక్క ప్రతి బెంచీ (న్యాయపీఠము)తమ అధికారితా పరిధిని వినియోగించుటకు సంబంధించిన ప్రాంతములను అధి సూచించవలెను.

(3) ఉప-పరిచ్ఛేదము (2)లో ఏమియున్నప్పటికిని, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్, అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుడిని ఒక బెంచీ (న్యాయపీఠము) నుండి మరో బెంచీకి (న్యాయపీఠమునకు) బదిలీ చేయవచ్చును.

విశదీకరణము

:- ఈ అధ్యాయపు నిమిత్తము

(i) "న్యాయిక సభ్యుడు" అనగా 113వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (బి)లోని ఉప ఖండము. (i) క్రింద అట్లు నియమించబడిన అపీలు ట్రిబ్యునలు సభ్యుడు అని అర్ధము మరియు ఇందులో అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ చేరియుండును.

(ii) "సాంకేతిక సభ్యుడు " అనగా 113వ పరిచ్ఛేదపు ఉప పరిచ్చేదము (1) యొక్క ఖండము (బి)లోని ఉప ఖండము (ii) లేక ఉప ఖండము (ii) క్రింద అట్లు నియమించబడిన అపీలు ట్రిబ్యునలు సభ్యుడు అని అర్ధము.

113 (1) ఒక వ్యక్తి,-

(ఎ) సర్వోన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా లేదా ఉన్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న లేక ఉండియున్న అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ విషయములో, మరియు