పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

... 75 G75.

92. సముచిత కమీషను, ప్రధాన కార్యస్థానము లేక ఛైర్-పర్సన్ ఆదేశించునట్టి ఏదేని ఇతర స్థలములో అట్టి సమయములో సమావేశము కావలెను, మరియు తాను నిర్దిష్ట పరచు (ఆ సమావేశములందు కోరముతో సహా) తన సమావేశములలో వ్యాపార కార్యకలాపముల విషయమునకు సంబంధించి అట్టి ప్రక్రియా నియమావళిని పాటించవలెను.

(2) ఛైర్-పర్సన్, సముచిత కమీషను యొక్క సమావేశమునకు అతను హాజరు కాలేనపుడు, ఈ విషయఘులో చైర్-పర్సన్ చే నామనిర్దేశము చేయబడు ఎవరేని ఇతర సభ్యుడు మరియు అట్టి నామనిర్దేశము చేయనిచో లేక చైర్ పర్సన్ లేనిచో, హాజరయిన సభ్యులలో నుండి ఎంపిక చేసిన ఎవరేని సభ్యుడు సమావేశమునకు అధ్యక్షత వహించవలెను.

(3) సముచిత కమీషను సమక్షమునందు ఉత్పన్నమగు అన్ని ప్రశ్నలకు, హాజరయి మరియు ఓటింగు చేయు సభ్యుల మెజారిటీ ఓట్ల ద్వారా నిర్ణయించబడును. మరియు సమానమైన ఓట్లు వచ్చినచో, చైర్ పర్సన్ లేక అతని గైరుహాజరులో, అధ్యక్షత వహించు వ్యక్తి రెండవ మరియు నిర్ణాయక ఓటును వేయవచ్చును.

(4) ఉప-పరిచ్ఛేదము (3)లో ఇతర విధముగా నిబంధించిననే తప్పు, ప్రతి సభ్యునికి ఒక ఓటు కలిగి ఉండును.

(5) సముచిత కమీషను యొక్క అన్ని ఉత్తర్వులు మరియు నిర్ణయములు, తన కార్యదర్శి లేక ఈ విషయములో చైర్ పర్సన్ చే ప్రాధికారమీయబడిన కమీషను యొక్క ఎవరేని ఇతర అధికారిచే అధి ప్రమాణీకరించబడవలెను.

93. సముచిత కమీషను యొక్క ఏ చర్యగాని లేక ప్రొసీడింగునుగాని ప్రశ్నింపబడరాదు లేక సముచిత కమీషను యొక్క సంఘటనలో ఏదేని ఖాళీ లేక లోపమున్నదను కారణమున మాత్రమే చెల్లనిది కారాదు.

94.(1) సముచిత కమీషను, ఈ చట్టము క్రింద ఏదేని విచారణ లేక ప్రొసీడింగుల ప్రయోజనము నిమిత్తము, ఈ క్రింది విషయములకు సంబంధించి సివిలు ప్రక్రియా స్మృతి, 1908 క్రింద సివిలు న్యాయస్థానములో నిహితమైన అవే అధికారములను కలిగి యుండును. అవేవనగా;-

(ఎ) ఎవరేని వ్యక్తిని సమను చేయుట మరియు తప్పనిసరిగా హాజరగునట్లు చేయుట మరియు ప్రమాణముపై అతనిని పరీక్షించుట;

(బి) సాక్ష్యముగా దాఖలు చేయదగిన ఏదేని దస్తావేజును లేక ఇతర వస్తు విషయమును వెల్లడించుట మరియు దాఖలుపరచుట,

(సి) అఫిడవిట్లపై సాక్ష్యమును పొందుట;