పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

అయితే, ఏ సభ్యుడుగాని, అట్టి కారణము లేక కారణముల పై సభ్యుని తొలగించ బడుటను తెలియపరచిన మీదట, కేంద్ర ప్రభుత్వము ద్వారా విహితపరచబడునట్టి ప్రక్రియ ననుసరించి అపి లేటు ట్రిబ్యునలు చైర్-పర్సన్ చే చేయబడిన విచారణ, విషయములో కేంద్రప్రభుత్వము లేక సందర్భానుసారము రాజ్య ప్రభుత్వము నిర్దేశము చేసిననే తప్ప ఖండము (డి), (ఇ) మరియు (ఎఫ్)లలో నిర్దిష్టపరచిన ఏవేని కారణములపై, అతనిని పదవి నుండి తొలగించరాదు.

(3) కేంద్ర ప్రభుత్వము, లేదా సంధర్బాసుసారము రాజ్య ప్రభుత్వము, ఉప- పరిచ్చేదము (2) క్రింద అపిలేటు ట్రిబ్యునలు యొక్క ఛైర్ పర్సన్ కు చేసిన నిర్దేశము విషయములో, అట్టి నిర్దేశముపై అపిలేటు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ యొక్క నివేదిక అందిన పిమ్మట కేంద్ర ప్రభుత్వము లేక సందర్భానుసారము రాజ్య ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయునంత వరకు సముచిత కమీషను యొక్క ఎవరేని సభ్యుని అపిలేటు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ సంప్రదింపుతో సస్పెండు చేయవచ్చును.

అయితే, ఈ పరిచ్ఛేదములోనున్న దేదియు, అతనిని అట్లు నియామకము చేయు సమయములో సర్వోన్నత న్యాయస్థాన ఉపవేశన న్యాయాధీశుడు లేక ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి లేక ఉన్నత న్యాయస్థాన న్యాయధీశునిగా నున్న సముచిత కమీషను యొక్క చైర్ పర్సనుకు వర్తించదు.

సముచిత కమీషను యొక్క ప్రొసీడింగులు మరియు అధికారములు.

91 (1) సముచిత కమీషను నిర్దిష్ట పరచబడునట్టి అధికారములను వినియోగించుటకు మరియు అట్టి కర్తవ్యములను నిర్వహించుటకు ఒక కార్యదర్శిని నియమించవలెను.

(2) సముచిత కమీషను సముచిత ప్రభుత్వ అనుమతితో ఇతర అధికారులు మరియు ఉద్యోగుల సంఖ్యలు, స్వభావము మరియు వర్గములను నిర్దిష్ట పరచవచ్చును.

(3) కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగులకు చెల్లించు జీతములు మరియు బత్తెములు మరియు ఇతర సేవా షరతులు మరియు నిబంధనలు, సముచిత ప్రభుత్వము యొక్క అనుమతితో నిర్దిష్ట పరచబడునట్లు ఉండవలెను.

(4) సముచిత కమీషను, నిర్దిష్ట పరచబడు షరతులు మరియు నిబంధనలపై అట్టి కృత్యముల నిర్వహణలో ఆ కమీషనుకు సహాయపడుటకు సంప్రదింపుదారులను నియమించవలెను.