పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________ (8) అపిలేటు ట్రిబ్యునలు యొక్క సభ్యుని లేక కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సన్ లేక ఇతర సభ్యుని నియామకము కొరకు ఎవరేని వ్యక్తిని సిఫారసు చేయుటకు పూర్వము, ఎంపిక కమిటీ, చైర్ పర్సన్ లేక సభ్యుడిగా అతని కృత్యములకు భంగము వాటిల్లదగు, ఏదేని విత్తీయ లేక ఇతర హితములేనట్టి వ్యక్తి యైయుండునట్లు. తాను సంతృప్తి పొందవలెను.

(9) ఎంపిక కమిటీలో ఏదేని ఖాళీ ఏర్పడిన కారణము మాత్రముననే ఛైర్-పర్సన్ లేక ఇతర సభ్యుని యొక్క నియామకమేదియు శాసనమాన్యత కోల్పోరాదు.

అయితే, ఈ పరిచ్ఛేదములో నున్నదేదియు సర్వోన్నత న్యాయస్థానము యొక్క న్యాయాధీశుడు లేక ఉన్నత న్యాయ స్థానము యొక్క ప్రధాన న్యాయమూర్తిగా వున్న లేక వుండినట్టి వ్యక్తి, కేంద్ర కమీషను యొక్క చైర్-పర్సన్ గా నియుక్తుడైన వ్యక్తికి వర్తించదు.

79.(1) కేంద్ర కమీషను. ఈ క్రింది కృత్యములను నిర్వర్తించవలెను, అవేవనగా

(ఎ) కేంద్ర ప్రభుత్వముచే స్వామ్యము కలిగియుండి లేక దాని నియంత్రణలోనున్న ఉత్పాదక కంపెనీల యొక్క టారిఫ్ ను క్రమబద్ధీకరించుట:

(బి) ఒక రాజ్యమునకు మించి విద్యుచ్ఛక్తి ఉత్పాదన చేయుట లేక విక్రయము చేయుట కొరకు సమ్మిళిత పథకముతో లేక ఇతర నిధముగా అట్టి ఉత్పాదక కంపెనీలు చేరినచో, ఖండము (ఎ)లో నిర్దిష్ట పరచిన కేంద్ర ప్రభుత్వము ద్వారా స్వామ్యము లేక నియంత్రణ కలిగినవి కానట్టి ఉత్పాదక కంపెనీల టారిఫ్ ను క్రమబద్ధీకరించుటకు:

(సి) అంతర్ రాజ్య ప్రసార విద్యుచ్చ క్తిని క్రమబద్ధీకరించుటకు:

(డి) అంతర్ రాజ్య ప్రసార విద్యుచ్ఛక్తి కొరకు టారిఫ్ ను నిర్ధారించుటకు:

(ఇ) వారి అంతర్ రాజ్య నిర్వహణలకు సంబంధించి ప్రసార లైసెన్సుదారు మరియు విద్యుచ్ఛక్తి వర్తకుడుగా కృత్యములను నిర్వహించు వ్యక్తులకు లైసెన్సులు జారీచేయుటకు;

(ఎఫ్) పైన పేర్కొనబడిన ఖండములు (ఏ) నుండి (డీ)లకు సంబంధించిన విషయములలో ఉత్పాదక కంపెనీలు లేక ప్రసార లైసెన్సుదారు చేరియున్న వివాదములపై అధినిర్ణయించుటకు మరియు మద్యవర్తిత్వము కొరకు ఏదేని వివాదమును నిర్దేశించుటకు;

(జి) ఈ చట్టపు ప్రయోజనాల కొరకు ఫీజును విధించుటకు;

(హెచ్) గ్రిడ్ ప్రమాణాలను కలిగియున్న గ్రిడ్ కోడ్ ను నిర్దిష్ట పరచుటకు;

(ఐ) నాణ్యతకు సంబంధించి ప్రమాణాలను, లైసెన్సుదారుల కొనసాగింపు మరియు విశ్వసనియ సర్వీసును నిర్దిష్ట పరచుటకు మరియు అమలుపరచుటకు;