పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

3/G63 (ఇ) ఉప-పరిచ్ఛేదము (3) ననుసరించి కేంద్ర ప్రభుత్వముచే నామనిర్దేశము చేయబడు ఒక వ్యక్తి -- సభ్యుడు;

(ఎఫ్) విద్యుత్తుతో వ్యవహరించుచున్న కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖ యొక్క ఇన్ ఛార్జి కార్యదర్శి -- సభ్యుడు.

(2) ఉస-పరిచ్చేదము (1) యొక్క ఖండము (డి) నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము, కంపెనీల చట్టము, 1956 యొక్క 4-ఏ పరిచ్ఛేదములో నిర్దిష్ట పరచిన ఏదేని పబ్లికు విత్తీయ సంస్థ యొక్క, ఏ పేరుతో పిలువబడినప్పటికీ చైర్ పర్సన్ లేదా మేనేజింగ్ డైరెక్టరు హోదాను కలిగియున్న వ్యక్తుల నుండి నామనిర్దేశము చేయవలెను.

(3) ఉప-పరిచ్చేదము (1) యొక్క ఖండము (ఇ) నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము, అధిసూచన ద్వారా ఈ ప్రయోజనము నిమిత్తము ఏదేని పరిశోధన, సాంకేతిక లేక మేనేజిమెంటు సంస్థ యొక్క, ఏ పేరుతో పిలువబడినప్పటికీ డైరెక్టరు లేదా సంస్థ యొక్క అధిపతి, హోదాను కలిగియున్న వ్యక్తుల నుండి నామనిర్దేశము చేయవలెను.

(4) విద్యుత్తులో వ్యవహించుచున్న కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖ యొక్క ఇన్ ఛార్జి కార్యదర్శి, ఎంపిక కమిటీ కన్వీనరుగా నుండవలెను.

(5) కేంద్ర ప్రభుత్వము, అపిలేటు ట్రిబ్యునలు సభ్యుడు లేక కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సన్ లేక సభ్యుడి మరణము. రాజీనామా లేక తొలగింపు కారణము వలన ఏదేని ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఒక మాసము లోపల మరియు అపిలేటు ట్రిబ్యునలు సభ్యుడు లేక కేంద్ర కమీషను యొక్క చైర్-పర్సన్ లేదా సభ్యుడి పదవీ విరమణ లేక పదవీ కాలావధి ముగింపుకు ఆరు మాసముల పూర్వము, ఖాళీని భర్తీ చేయుటకు ఎంపిక కమిటీకి నిర్దేశమును పంపవలెను.

(6) ఎంపిక కమిటీ, తనకు చేయబడిన నిర్దేశము తేదీ నుండి మూడు మాసముల లోపు ఉప పరిచ్ఛేదము (5)లో పేర్కొనబడిన చైర్ పర్సన్ మరియు సభ్యుల యొక్క ఎంపికను పూర్తిచేయవలెను.

(7) ఎంపిక కమిటీ, తనకు నిర్దేశించిన ప్రతి ఖాళీ కొరకు రెండు పేర్లు కలిగిన ప్యానెలును సిఫారసు చేయవలెను.