పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

. .. 61/ G61 (2) విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 యొక్క 3వ పరిచ్చేదము క్రింద ఏర్పాటు చేయబడి, అట్టి నియమిత తేదీకి అవ్యవహిత పూర్వము పనిచేయుచున్న కేంద్ర విద్యుచ్ఛక్తి, క్రమబద్ధీకరణ కమీషను, ఈ చట్టపు ప్రయోజనాల నిమిత్తము కేంద్ర కమీషనుగా భావించబడవలెను మరియు 'ఛైర్-పర్సన్, సభ్యులు, కార్యదర్శి మరియు ఇతర అధికారులు మరియు దాని యొక్క ఉద్యోగులు, ఈ చట్టము క్రింద నియమించబడినట్లుగా భావించబడవలెను మరియు వారు విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 క్రింద ఏ నిబంధనలు, మరియు షరతులపై నియమించబడినారో అవే నిబంధనలు మరియు షరతులు పై పదవియందు కొనసాగవలెను.

అయితే, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 క్రింద ఈ చట్టపు ప్రారంభమునకు పూర్వము, నియమించబడిన కేంద్ర కమీషను చైర్ పర్సన్ మరియు ఇతర సభ్యులు, 78వ పరిచ్చేదము (1) క్రింద ఏర్పాటు చేయబడిన ఎంపిక కమిటీ యొక్క " సిఫారసుల పై, కేంద్ర ప్రభుత్వము చే, ఈ చట్టము క్రింద నిబంధనలకు మరియు షరతులకు అభీష్టము తెలుపుటకు అనుమతించబడవచ్చును.

(3) కేంద్ర కమీషను, స్థిర మరియు చర ఆస్తులను ఆర్జించు, కలిగియుండు మరియు వ్యయనము చేయు అధికారముతో శాశ్వత ఉత్తరాధికారమును మరియు సామన్య మొహరును కలిగియుండి సదరు పేర్కొనబడిన నామముతో నిగమ నికాయముగా నుండును మరియు కాంట్రాక్టు చేసుకొనవచ్చును మరియు సదరు నామములో దావా వేయవచ్చును. లేదా దాని పై దావా వేయబడవచ్చును.

(4) కేంద్ర కమీషను యొక్క ప్రధాన కార్యాలయము, కేంద్ర ప్రభుత్వముచే అధినూచన ద్వారా నిర్దిష్ట పరచునట్టి స్థలములో నుండవలెను.

(5) కేంద్ర కమీషను ఈ క్రింద సభ్యులతో కూడి యుండవలెను, వారెవరనగా:-

(ఎ) చైర్ పర్సన్ మరియు ముగ్గురు ఇతర సభ్యులు

(బి) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్. ఇతడు పదవిరీత్యా సభ్యుడుగా నుండవలెను.

(6) కేంద్ర కమీషను చైర్ పర్సన్ మరియు, సభ్యులను 78వ పరిచ్ఛేదములో నిర్దేశించబడిన ఎంపిక కమిటీ యొక్క సిఫారసుపై కేంద్ర ప్రభుత్వము నియమించును.

77 (1) కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సన్ మరియు సభ్యులు, ఇంజనీరింగు, న్యాయశాస్త్రము, అర్ధికశాస్త్రము, వాణిజ్యశాస్త్రము, విత్తశాస్త్రము లేక మేనేజిమెంటు శాస్త్రములకు సంబంధించి సమస్యల పరిష్కారమునకు, తగిన పరిజ్ఞానము లేక అనుభవము; చూపగల సమర్ధత కలిగిన వ్యక్తియై ఉండవలెను మరియు ఈ క్రింద పేర్కొనబడిన రీతిలో నియమింపబడవలెను, అదేదనగా; -