పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 60/ 660 (ఎమ్) విద్యుచ్ఛక్తి వ్యవస్థను మెరుగుపరచు రీతిలో వారి యొక్క స్వామ్యము లేక నియంత్రణ క్రింద దానిని నడుపుట మరియు నిర్వహించుటకు వీలుగా అట్టి విషయముల పై ఏదేని రాజ్య ప్రభుత్వము, లైసెన్సుదారు లేక ఉత్పాదక కంపెనీలకు మరియు అవసరమైనపుడు ఇతర విద్యుచ్ఛక్తి వ్యవస్థ యొక్క స్వామ్యము లేక నియంత్రణలో నున్న ఏదేని ఇతర ప్రభుత్వము,, లైసెన్సుదారు లేక ఉత్పాదక కంపెనీ యొక్క సమన్వయముతో సలహానిచ్చుట;

(ఎన్) విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము మరియు పంపిణీకి సంబంధించిన అన్ని సాంకేతిక విషయాలలో సముచిత ప్రభుత్వమునకు మరియు సముచిత కమీషనుకు సలహానిచ్చుట; మరియు

(ఓ) ఈ చట్టము క్రింద నిబంధించబడు అట్టి ఇతర కృత్యములను నిర్వర్తించుట.

కొన్ని అధికారములు మరియు ఆదేశములు.

74. ప్రాధికార సంస్థచే నిర్దిష్ట పరచబడునట్టి సమయములలో మరియు అట్టి ప్రరూపము మరియు రీతిలో, తాను కోరిన విధముగా విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము. పంపిణీ, వర్తకము మరియు ఉపయోగమునకు సంబంధించినట్టి గణాంకాలు, రిటర్నులు మరియు ఇతర సమాచారమును ప్రాధికార సంస్థకు సమకూర్చుట దాని లేక అతని స్వంత ఉపయోగము కొరకు ఉత్పాదన చేయు ప్రతి లైసెన్సుదారు, ఉత్పాదక కంపెనీ లేక వ్యక్తి యొక్క బాధ్యత అయి ఉండును.

75 (1) తన కృత్యములను నిర్వర్తించుటలో ప్రాధికార సంస్థ, కేంద్ర ప్రభుత్వముచే ప్రజాహితము కలిగియున్న విధాన విషయాలలో వ్రాతపూర్వకముగా తనకు ఇచ్చినట్టి ఆదేశములు మార్గదర్శకమగును.

(2) ప్రజాహితము కలిగియున్న విధాన విషయములకు సంబంధించి ఏదేని అట్టి ఆదేశములు పై ఏదేని ప్రశ్న ఉత్పన్నమైనచో, దానిపై కేంద్రప్రభుత్వ నిర్ణయము అంతిమమైనదగును.

భాగము - 10

క్రమబద్దీకరణ కమీషన్లు.

కేంద్ర కమీషను సంఘటన, అధికారములు మరియు కృత్యములు.

76.(1) ఈ చట్టము క్రింద తమకు ఒసగబడిన అధికారములను వినియోగించుటకు మరియు అప్పగించబడిన కృత్యములను నిర్వర్తించుటకు కేంద్ర విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషనుగా పిలువబడు కమీషను నొక దానిని ఏర్పాటు చేయవలెను.