పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 19/059. (బి) విద్యుచ్ఛక్తి ప్లాంట్లు, విద్యుచ్ఛక్తి లైన్ల నిర్మాణము మరియు గ్రిడ్ కు కలుపుటకు సాంకేతిక ప్రమాణాలను నిర్దిష్ట పరచుట,

(సి) విద్యుచ్ఛక్తి. ప్లాంట్లు మరియు విద్యుచ్ఛక్తి లైన్ల నిర్మాణము, క్రియాకలాపం మరియు నిర్వహణ కొరకైన సంరక్షణ ఆవశ్యకతలను నిర్దిష్ట పరచుట;

(డి) ప్రసార లైన్ల క్రియాకలాపములు మరియు నిర్వహణ కొరకు గ్రిడ్ ప్రమాణాలను నిర్దిష్ట పరచుట,

(ఇ), విద్యుచ్ఛక్తి ప్రసారము మరియు సరఫరా కొరకు మీటర్లను ఏర్పాటు చేయుటకై షరతులను నిర్దిష్ట పరచుట;

(ఎఫ్) విద్యుచ్ఛక్తి వ్యవస్థను మెరుగుపరచు మరియు అభివృద్ధిపరచుట కొరకు పధకాలను మరియు ప్రాజెక్టులను సమయములోపు పూర్తి చేయటకు ప్రోత్సహించుట మరియు సహకరించుట;

(జి) విద్యుచ్ఛక్తి పరిశ్రమలో పనిచేయు వ్యక్తుల నైపుణ్యతను పెంచుట కొరకు ప్రోత్సాహక చర్యలు;

(హెచ్) కేంద్ర ప్రభుత్వమునకు, తాను సలహాను కోరిన ఏదేని విషయము పై సలహా నిచ్చుట లేక విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము, వర్తకము. పంపిణీ మరియు వినియోగమును మెరుగుపరచుటలో సిఫారసు సహాయపడగలదని ప్రాధికార సంస్థ అభిప్రాయ పడినచో ఏదేని విషయము పై ప్రభుత్వమునకు సిఫారసు చేయుటకు;

(ఐ) విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము, వర్తకము, పంపిణీ మరియు వినియోగమును సంబంధించిన భోగట్టాను సేకరించుట మరియు రికార్డు చేయట; మరియు ధర, సామర్ధ్యము, పోటీ మరియు అటువంటి విషయములకు సంబంధించి అధ్యయనము చేయుట:

(జె) ఈ చట్టము క్రింద సేకరించిన సమాచారమును ఆయా సమయములందు బహిరంగపరచుట మరియు నివేదికలను మరియు దర్యాప్తులను ప్రచురణ కొరకు ఏర్పాటు చేయుట:

(కె) విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము, పంపిణీ మరియు వర్తకము ప్రభావితమగు విషయములలో పరిశోధనను పెంపొందించుట;

(ఎల్) విద్యుచ్చక్తిని ఉత్పాదన చేయు లేక ప్రసారము చేయు లేక పంపిణీ చేయు ప్రయోజనముల నిమిత్తము ఏదేని దర్యాప్తు చేయుట లేక చేయుటకు కారణము చూపుట; .