పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 58.658 (13) ప్రాధికార సంస్థ యొక్క ఏదేని చర్య లేక ప్రొసీడింగు ప్రశ్నింపబడరాదు. లేక ప్రాధికార సంస్థ యొక్క ఏర్పాటులో ఏదేని ఖాళీ ఏర్పడినదని లేక ఏదేని లోపమున్నదను కారణమున మాత్రమే శాసనమాస్యత కోల్పోరాదు.

(14) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్ మరియు ఇతర పూర్తికాలిక సభ్యులు కేంద్ర ప్రభుత్వము ద్వారా నిర్ధారించబడునట్టి జీతము మరియు బత్తెములు పోందవలెను మరియు ఇతర సభ్యులు, ప్రాధికార సంస్థ సమావేశములకు హజరుకై కేంద్ర ప్రభుత్వము విహితపరచునట్టి భత్యములను మరియు ఫీజును పొందవలెను.

(15) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్ మరియు సభ్యుల సేవ యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు ఉప-పరిచ్చేదము (6) యొక్క నిబంధనలకు లోబడి, వారి పదవీ కాలావధితో సహా, కేంద్ర ప్రభుత్వము విహితపరచునట్లు ఉండవలెను.

71. ప్రాధికార సంస్థ యొక్క ఏ సభ్యుడుగాని, ఏదేని కంపెనీ లేక ఇతర నిగమ నికాయము లేక వ్యక్తుల అసోసియేషను నిగమితమొనర్చినను లేక నిగమితమొనర్చకున్నను లేక విద్యుచ్ఛక్తి ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ మరియు వర్తకము. లేదా దాని యొక్క ఉత్పాదన కొరకు ఇంధనము లేదా విద్యుచ్చక్తి సామగ్రి తయారీలో వ్యాపారము చేయు ఫర్ము, తన స్వనామములో గాని లేక వేరు విధముగాగాని ఏదేని వాటా లేక హితమును కలిగియుండరాదు.

72. ప్రాధికార సంస్థ. ఈ చట్టము క్రింద తన కృత్యములను నిర్వర్తించుట కొరకు ఒక కార్యదర్శిని మరియు తాను యుక్తమని భావించునట్టి ఇతర అధికారులు మరియు ఉద్యోగులను నియతము చేయవచ్చును. మరియు కేంద్ర ప్రభుత్వ సంప్రదింపుతో ప్రాధికార సంస్థ జీతము, పారితోషికము, ఫీజు, బత్తెము. పింఛను, సెలవు మరియు గ్రాట్యుయిటీ లను అట్టి షరతులపై నిర్ణయించవచ్చును.

అయితే, కార్యదర్శి యొక్క నియామకము కేంద్ర ప్రభుత్వ ఆమోదమునకు లోబడి ఈ ఉండును.

73. ప్రాధికార సంస్థ కేంద్ర ప్రభుత్వము విహితపరచు లేక ఆదేశించునట్టి కృత్యములు మరియు కర్తవ్యములను నిర్వహించవలెను మరియు ప్రత్యేకించి -

(ఎ) జాతీయ విద్యుచ్ఛక్తి విధానమునకు సంబంధించిన విషయముల పై కేంద్ర ప్రభుత్వమునకు సలహానిచ్చుట, విద్యుచ్ఛక్తి విధానపు అభివృద్ధి కొరకు స్వల్పకాలిక మరియు సమగ్ర ప్రణాళికను రూపొందించుట: జాతీయ మితవ్యయము యొక్క హితములను చేకూర్చుటకు వనరుల అభిలషణీయ వినియోగము కొరకు ప్రణాళికా ఏజెన్సీల కార్యకలాపాలను సమన్యయము చేయుటకు మరియు వినియోగదారులందరికి విద్యుచ్ఛక్తిని విశ్వసనీయము గాను మరియు అందుబాటులో నుండునట్లు ఏర్పాటు చేయుట;