పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

భాగము - 7

ధరల పట్టీ (టారిఫ్)

61. సముచిత కమీషను, ఈ చట్టపు నిబంధనలకు లోబడి, ధరల పట్టీ నిర్ధారణపై నిబంధనలను మరియు షరతులను నిర్దిష్ట పరచవలెను. మరియు అట్లు చేయుటలో ఈ క్రిందివి మార్గదర్శకములై ఉండవలెను, అవేవనగా:

(ఎ) ఉత్పాదక కంపెనీలకు మరియు ప్రసార లైసెన్సుదారులకు వర్తించు ధరల పట్టీ నిర్ధారణ కొరకు కేంద్ర కమీషను ద్వారా నిర్దిష్ట పరచబడిన సూత్రములను మరియు పద్ధతులను

(బి) విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము, పంపిణీ మరియు సరఫరాలను వాణిజ్య ప్రాతిపదికపై నిర్వహణ,

(సి) పోటీ సమర్ధత, వనరుల సద్వినియోగము, మంచి నిర్వహణ మరియు అభిలషణీయమైన పెట్టుబడులను ప్రోత్సహించు కారకములు:

(డి) వినియోగదారుల హితమును కాపాడుట మరియు అదే సమయములో తగురీతిలో విద్యుచ్ఛక్తి ధరను తిరిగి వసూలు చేయుట,

(ఇ) నిర్వహణలో సమర్ధతకు బహుమానమును అందించు సూత్రములు;

(ఎఫ్) బహుళార్ధ సంవత్సరముల టారిఫ్ సూత్రములు;

(జి) టారిఫ్ (ధరల పట్టీ) విద్యుచ్ఛక్తి సరఫరా ధరల క్రమాభివృద్ధిని సూచిస్తుంది మరియు సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడిన రీతిలో ఎదురు రాయితీలను కూడా తగ్గిస్తుంది.

(హెచ్) శక్తి నవీకరణ, వనరుల నుండి విద్యుచ్ఛక్తి సహా ఉత్పాదకత మరియు ఉత్పాదకతను పెంపొందించుటకు;

(2) జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మరియు ధరల పట్టీ విధానము:

అయితే విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 మరియు నియమిత తేదీకి అవ్యవహిత పూర్వము గల అనుసూచిలో నిర్దిష్టపరచిన శాసనముల క్రింద టారిఫ్ సూచిని నిర్ధారించుట కొరకు గల నిబంధనలు మరియు షరతులు, ఒక సంవత్సర కాలావధి వరకు లేక ఈ పరిచ్ఛేదము క్రింద ధరల పట్టీ కొరకు నిబంధనలను మరియు షరతులు మరియు నిబంధనలను నిర్దిష్ట పరచునంత వరకు, వీటిలో ఏది ముందయినచో అంతవరకు వర్తించుట కొనసాగును.