పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

47647

వినియోగదారు రక్షణ: నిర్వహణా ప్రమాణాలు.

57.(1) సముచిత కమీషను, లైసెన్సుదారులను మరియు ప్రభావితమునకు గురికాగల వ్యక్తులను సంప్రదించిన పిమ్మట, లైసెన్సుదారు. 'లేక లైసెన్సుదారుల తరగతి యొక్క నిర్వహణ ప్రమాణాలను నిర్దిష్ట పరచవచ్చును.

(2) ఉపపరిచ్చేదము (1)లో నిర్దిష్ట పరచిన ప్రమాణాలను సాధించుటలో లైసెన్సుదారు విఫలమైనచో, విధించబడు పెనాల్టీకి లేక ప్రారంభించబడు అభియోగము నకు భంగము వాటిల్లకుండా, అతడు సముచిత కమీషనుచే నిర్ధారించబడునట్లుగా ప్రభావితుడైన వ్యక్తికి నష్ట పరిహారమును చెల్లించుటకు పాత్రుడగును.

అయితే, నష్ట పరిహారమును నిర్ధారించుటకు పూర్వము, సంబంధిత లైసెన్సుదారు నకు ఆకర్ణింపబడుటకు తగిన అవకాశమును ఇవ్వవలెను.

(3) ఉప పరిచ్చేదము (2) క్రింద నిర్ధారించబడిన నష్ట పరిహారమును అట్టి నిర్ధారణకు తొంబది రోజుల లోపు సంబంధిత లైసెన్సుదారు చెల్లించవలెను.

58. సముచిత కమీషను, ఒక తరగతి లేక తరగతుల లైసెన్సుదారులకు 57వ పరిచ్చే దపు ఉప పరిచ్చేదము (1) క్రింద వివిధ ప్రమాణాలను నిర్దిష్ట పరచ వచ్చను.

59 (1) ప్రతి లైసెన్సుదారు, సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచిన కాలావధిలోపు, కమీషనుకు ఈ క్రింది సమాచారమును అందజేయవలెను; అదేదనగా:-

(ఎ) 57వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద సాధించిన నిర్వహణా స్థాయీలు;

(బి) 57వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద చేసిన నష్టపరిహారమునకు సంబంధించిన కేసుల సంఖ్య మరియు నష్ట పరిహారపు వెరసి మొత్తము.

(2) సముచిత కమీషను, ఉప-పరిచ్చేదము (1) క్రింద తనకు అందజేయబడినట్టి సమాచారపు ప్రచురణ కొరకు తాము సముచితమని భావించునట్టి ప్రరూపములోను, అట్టి రీతిలోను ప్రతి సంవత్సరము కనీసము ఒకసారి ఏర్పాటు చేయవలెను.

60. సముచిత కమీషను, ఒక లైసెన్సుదారునకు లేక ఉత్పాదక కంపెనీకి అట్టి లైసెన్సుదారు లేక ఉత్పాదక కంపెనీ ఏదేని కరారు చేసుకొన్నచో లేక తన ఆధిక్యత స్థానమును దురుపయోగము చేసినచో లేక విద్యుచ్ఛక్తి పరిశ్రమలో పోటీపై ప్రతికూల ప్రభావమునకు కారణము లేక కారణములు ఏర్పడగల సంయోగము ఉన్నచో, తాను సబబని భావించునట్టి ఆదేశములను జారీచేయవచ్చును.