పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 46/G46.. (3) ఈ పరిచ్చేదములోనున్న నిబంధనలు లేక ఉప పరిచ్చేదము (1) క్రింద చేసిన వినియమముల అమలులో ఏ వ్యక్తి అయినను, వైఫల్యము చెందినచో సముచిత కమీషను, వైఫల్యమునకు బాధ్యుడైన ఉత్పాదక కంపెనీ లేక లైసెన్సుదారు లేక కంపెనీ యొక్క ఎవరేని అధికారులు లేక ఇతర అసోసియేషను లేక ఎవరేని ఇతర వ్యక్తి తన వైఫల్యమును సరిదిద్దుకొనుటకు తాను సబబని భావించునట్టి ఉత్తర్వును చేయవచ్చును.

56.(1) ఎవరేని వ్యక్తి. అతనికి విద్యుచ్ఛక్తి సరఫరా, ప్రసారము లేక పంపిణీ లేక 'వీలింగ్ చేసిన దానికి సంబంధించి లైసెన్సుదారునికి లేక ఉత్పాదక కంపెనీకి అతడు బాకీపడిన ఏదేని విద్యుత్ ఛార్జీని లేక విద్యుత్ ఛార్జీ కానట్టి ఏదేని మొత్తమును చెల్లించుటకు ఉపేక్షించిన యెడల, లైసెన్సుదారు లేక ఉత్పాదక కంపెనీ అట్టి వ్యక్తికి పదునైదు దినములు తక్కువ కాకుండునట్టి వ్రాతపూర్వకమైన స్పష్టమైన నోటీసును ఇచ్చిన మీదట మరియు అట్టి ఛార్జీని లేక ఇతర మొత్తమును దావా ద్వారా తిరిగి రాబట్టుకొను అతని హక్కులకు భంగము పాటిల్లకుండా విద్యుచ్ఛక్తి సరఫరాను నిలిపి వేయ వచ్చును మరియు అట్టి లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ ద్వారా విద్యుచ్ఛక్తిని సరఫరా, ప్రసారము, పంపిణీ మరియు వీల్డ్ చేయు ఏదేని విద్యుచ్ఛక్తి సరఫరా లైను లేక ఇతర పనులు వాటి ఆస్తి అయినపుడు, ఈ ప్రయోజనము నిమిత్తము వాటిని తీసివేయ వచ్చును లేదా నిలిపివేయ వచ్చును. మరియు సరఫరాను తీసివేయుటకు మరియు తిరిగి ఇచ్చుటకు అట్టి ఛార్జీ లేక ఇతర మొత్తము అతని ద్వారా చేయబడిన ఏవేని ఖర్చులతో సహా చెల్లింపబడునంత వరకు సరఫరాను నిలిపివేయ వచ్చును. అంతేగాని, అటు పిమ్మట అయి ఉండరాదు.

అయితే, అతను మరియు లైసెన్సుదారు మధ్య ఏదేని వివాదము పరిష్కారమునకై పెండింగులో నున్నపుడు,

(ఎ) అతని నుండి క్లెయిము చేసిన మొత్తమునకు సమాన మొత్తమును; లేక

(బి) గడచిన ఆరు మాసముల సమయములో అతనిచే చెల్లింపబడిన విద్యుచ్ఛక్తి సగటు ఛార్జీ ఆధారముగా లెక్కించబడిన ప్రతి మాసమునకు అతని నుండి రావలసియుండు విద్యుచ్ఛక్తి ఛార్జీలు

వీటిలో ఏది తక్కువయినచో దానిని, అభ్యంతరము తెలియజేయుచూ అట్టి వ్యక్తి డిపాజిటు చేసినచో, విద్యుచ్ఛక్తి సరఫరాను నిలిపి వేయరాదు.

(2) తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమి ఉన్నప్పటికిని, ఈ పరిచ్ఛేదము క్రింద ఎవరేని వినియోగదారుని నుండి బాకీయున్న మొత్తమును, విద్యుచ్ఛక్తి సరఫరా ఛార్జీల బాకీగా వసూలు చేయదగునట్టి మొత్తము చూపబడుచున్ననే తప్పు, అట్టి మొత్తము మొదట అట్లు బాకీపడిన తేదీ నుండి రెండు సంవత్సరముల కాలావధి పిమ్మట వసూలు చేయరాదు మరియు లైసెన్సుదారు విద్యుచ్ఛక్తి సరఫరాను తీసివేయరాదు.