పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 145/ 645. విద్యుచ్ఛక్తి ప్రసారము లేక వినియోగము ప్రారంభించుటకు పూర్వం, విద్యుచ్ఛక్తి, ప్రతిష్టాపన మరియు ప్లాంటు ఏవేని ఉన్నచో వాటి వివరములు, సరఫరా స్వభానము మరియు ప్రయోజనము మరియు ఈ చట్టములోని భాగము XVII యొక్క వర్తించదగునట్టి నిబంధనలు పొందుపరచుచూ లిఖిత పూర్వకముగా తమ ఉద్దేశమును తెలియజేయుచూ విద్యుత్ ఇన్-స్పెక్టరు మరియు జిల్లా మేజిస్ట్రేటు లేక సందర్భానుసారముగా పోలీసు కమీషనరుకు ఏడు దినముల కంటే తక్కువ కాని నోటీసును ఇవ్వకుండ,

రెండు వందల యాభై వాట్లు మరియు వంద వోల్టులకు మించని ప్రమాణములో విద్యుచ్ఛక్తి ప్రసారము లేక వినియోగము చేయరాదు: -

అయితే, ఈ పరిచ్ఛేదములో నున్నదేదియు, ప్రయాణీకులు, జంతువులు లేక సరుకుల సార్వజనిక వాహకము కోరకు లేదా రైల్వే చట్టము, 1989 యొక్క నిబంధనలకు లోబడి ఏదేని రైల్వే లేక ట్రామ్ వేల రోలింగ్ స్టాక్ యొక్క వెలుతురు లేక వాయు ప్రసరణము పై లేదా వాటి కొరకు ఉపయోగించెడి విద్యుచ్ఛక్తికి వర్తించదు.

(2) ఒక స్థలమునందు వంద లేక అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు సాధారణముగా సమావేశమగుటకు అవకాశమున్నను లేక లేకున్నను. ఆ విషయమునకు సంబంధించి ఏదేని వ్యత్యాసము లేక వివాదము ఏర్పడినచో, దానిని రాజ్య ప్రభుత్వమునకు నిర్దేశించవలెను. మరియు దానిపై రాజ్య ప్రభుత్వము చేయు నిర్ణయము అంతిమమై యుండును.

(3) ఈ పరిచ్చేదపు నిబంధనలకు ప్రభుత్వము కట్టుబడి యుండవలెను.

55.(1) ఏ లైసెన్సుదారు. ఈ విషయములలో ప్రాధికారిచే చేయబడు వినియమముల ననుసరించి సరియైన మీటరును అమర్చిననే తప్ప, నియతము చేసిన తేదీ నుండి రెండు ఈ సంవత్సరముల కాలావధి ముగిసిన పిమ్మట, విద్యుచ్ఛక్తిని సరఫరా చేయరాదు.

అయితే, వినియోగదారు మీటరు కొనుగోలు కై ఎంపిక చేసుకొన్ననే తప్పు, లైసెన్సుదారు మీటరు ధర కొరకు సెక్యూరిటీ ఇవ్వవలెనని వినియోగదారుని కోరవచ్చును మరియు దాని కిరాయి కొరకు కరారును చేసుకొనవచ్చును.

అంతేగాక, రాజ్య కమీషను, అధిసూచన ద్వారా ఆ అధి సూచనలో నిర్దిష్ట పరచబడు తరగతి లేక తరగతుల వ్యక్తుల కొరకు లేదా అట్టి ప్రాంతము కొరకు సదరు రెండు సంవత్సరముల కాలవాధిని విస్తరించవచ్చును.

(2) విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము మరియు పంపిణీ లేక వర్తకములో సరియైన లెక్కింపు మరియు ఆడిటింగు కొరకు, ప్రాధికార సంస్థ, విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము లేక పంపిణీ లేక వర్తకపు అట్టి దశలలో మరియు తాను సబబని భావించునట్టి ఉత్పాదన, ప్రసారము, లేక పంపిణీ లేక వర్తకపు స్థలములలో ఉత్పాదక కంపెనీ లేక లైసెన్సుదారు మీటర్లను అమర్చవలెనని ఆదేశించవచ్చును