పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

41641 (4) 62వ పరిచ్చేదపు నిబంధనలకు లోబడి, ఈ పరిచ్ఛేదము క్రింద ఛార్జీలను నిర్ణయించుటలో పంపిణీ లైసెన్సుదారు, ఎవరేని వ్యక్తి లేక ఏదేని తరగతికి చెందిన వ్యక్తులకు అనుచిత ప్రాధాన్యము లేక ఎవరేని వ్యక్తి లేక ఏదేని తరగతికి చెందిన వ్యక్తుల పట్ల విచక్షణ చూపరాదు.

(5) పంపిణీ లైసెన్సుదారుచే నిర్ణయించబడిన ఛార్జీలు. ఈ చట్టము యొక్క నిబంధనలు మరియు సంబంధిత రాజ్య కమీషనుచే ఈ విషయమై చేయబడిన వినియమములనను సరించి ఉండవలెను.

46. రాజ్య కమీషను, 43వ పరిచ్చేదమును పురస్కరించుకొని విద్యుచ్ఛక్తి సరఫరాను కోరుచున్నట్టి వ్యక్తి నుండి, పంపిణీ లైసెన్సుదారుడు వినియమముల ద్వారా అట్టి సరఫరా ఇచ్చుట కొరకు వినియోగించిన ఏదేని విద్యుత్ లైను లేక విద్యుత్ ప్లాంటును సమకూర్చుటకై భరించిన ఏవేని సముచితమైన ఖర్చులను రాబట్టుకోనుటకు ప్రాధికారమీయ వచ్చును.

47 (1) ఈ పరిచ్ఛేదపు నిబంధనలకు లోబడి, పంపిణీ లైసెన్సుదారు, 43వ పరిచ్ఛేదమును పురస్కరించుకొని విద్యుచ్ఛక్తి సరఫరాను కోరుచున్న ఎవరేని వ్యక్తిని

(ఎ) సదరు వ్యక్తికి సరఫరా చేసిన విద్యుచ్ఛక్తికి సంబంధించి; లేక

(బి) సదరు వ్యక్తికి విద్యుచ్ఛక్తి సరఫరా కొరకు ఏదేని విద్యుత్ లైను లేక విద్యుత్ ప్లాంటు లేక విద్యుత్ మీటరు సమకూర్చవలసి ఉన్న యెడల, అట్టి లైను లేక ప్లాంటు లేక మీటరు ఏర్పాటుకు సంబంధించి, పంపిణీ లైసెన్సుదారుకు బకాయి ఉన్న అన్ని పైకముల చెల్లింపు కొరకు వినియముల ద్వారా నిర్ధారించబడునట్టి విధముగా సముచిత సెక్యూరిటీని ఈయమని కోరవచ్చును.మరియు అట్టి సెక్యూరిటీని ఇచ్చుటలో సదరు వ్యక్తి వైఫల్యము చెందినచో, పంపిణీ లైసెన్సుదారు, సబబని భావించినచో, వైఫల్యము కొనసాగిన కాలవధిలో విద్యుచ్ఛక్తి సరఫరాను ఇచ్చుటకు లైను లేక ప్లాంటు లేక మీటరు సమకూర్చుటకు తిరస్కరించ వచ్చును.

(2) ఉప పరిచ్ఛేదము (1)లో పేర్కొనినట్లుగా ఎవరేని వ్యక్తి సెక్యూరిటీ ఈయని యెడల లేక ఎవరేని వ్యక్తిచే ఈయబడిన సెక్యూరిటీ చెల్లనిది. లేక సరిపోనిదైన యెడల, పంపిణీ లైసెన్సుదారు, నోటీసు ద్వారా ఆ వ్యక్తిని నోటీసును తామీలు చేసిన తరువాత ముప్పది దినముల లోపల, విద్యుచ్ఛక్తి సరఫరా లేక అట్టి లైను, లేక ప్లాంటు లేక మీటరు ఏర్పాటుకు సంబంధించి అతడికి బకాయి ఉన్న పైకములన్నియు చెల్లించుట కొరకు సముచితమైన సెక్యూరిటీని ఈయమని కోరవచ్చును.