పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

374637 అంతేకాక, సర్ ఛార్టీ చెల్లింపు మరియు దానిని వినియోగించవలసిన రీతిని కూడా సముచిత కమీషను నిర్దిష్ట పరచవలెను.

అంతేకాక, తన స్వంత వినియోగ గమ్యస్థానమునకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేసికొనుటకు క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటును స్థాపించుకున్నట్టి వ్యక్తికి ప్రవేశ సౌలభ్యము సమకూర్చబడిన సందర్భములో అట్టి సర్-ఛార్జీ విధించబడరాదు.

41, ప్రసార లైసెన్సుదారు, సముచిత కమీషనుకు ముందు తెలియజేయుట ద్వారా తన ఆస్తుల అత్యంతానుకూలమైన వినియోగము కొరకు ఏదేని వ్యాపారములో నిమగ్నం కావచ్చును.

అయితే, అట్టి వ్యాపారము నుండి లభించిన రెవిన్యూ యొక్క అనుపాతం సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి విధముగా తమ ప్రసార మరియు వీలింగు ఛార్జీలను తగ్గించుటకు వినియోగించబడవలెను.

అంతేకాక, ప్రసార లైసెన్సుదారు, ప్రసార వ్యాపారము ఏదేని మార్గములో అట్టి వ్యాపారసంస్థకు ఆర్థిక సహాయము అందించుటగాని లేక ఏదేని మార్గములో అట్టి వ్యాపారమును పోషించుటకు తన ప్రసార ఆస్తుల పై భారము పడకుండ జాగ్రత్త వహించుటకు అట్టి ప్రతియొక వ్యాపారము కొరకై ప్రత్యేక లెక్కలు నిర్వహించవలెను.

అంతేకాక, ఏ ప్రసార లైసెన్సుదారుడు, ఏదేని కాంట్రాక్టును కుదుర్చుకొనరాదు లేక విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో ఇతర విధంగా నిమగ్నం కూడా కారాదు.

భాగము - 6

విద్యుచ్ఛక్తి పంపిణీ

పంపిణీ లైసెన్సుదారులకు సంబంధించిన నిబంధనలు

42. (1) తన సరఫరా ప్రాంతములో దానిని సమర్థవంతముగాను, సమన్వయముతోను మరియు మితవ్యయముతో పంపిణీ వ్యవస్థను అభివృద్ధి పరచుట మరియు నిర్వహించుట మరియు ఈ చట్టములో యున్నట్టి నిబంధనలననుసరించి విద్యుచ్ఛక్తి సరఫరా చేయుట పంపిణీ లైసెన్సుదారు కర్తవ్యమై ఉండును.

(2) రాజ్య కమీషను, దానిచే నియతము చేసిన తేదీకి ఒక సంవత్సరము లోపల నిర్దిష్టపరచబడునట్టి దశలలో మరియు (ఎదురు సబ్సిడీలు మరియు ఇతర నిర్వహణపరమైన నిరోధములతో సహా) అట్టి షరతులకు లోబడి ప్రవేశ సౌలభ్యమును ప్రవేశ పెట్టవలెను మరియు వరుసగావచ్చు దశలలో ప్రవేశ సౌలభ్యము యొక్క పరిధిని నిర్దిష్ట పరచుటలో