పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ అయితే, అట్టి సర్ ఛార్జీని ప్రస్తుత స్థాయి ఎదురు. సబ్సిడీ అవసరములను భరించు నిమిత్తము వినియోగించవలెను:

అంతేకాక, అట్టి సర్ ఛార్జీ మరియు ఎదురు రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో సబ్సిడీలను క్రమంగా తగ్గించవలెను.

అంతేకాక, సర్ ఛార్జీ చెల్లింపు మరియు దానిని వినియోగించవలసిన రీతిని కూడా రాజ్య కమీషను నిర్దిష్ట పరచవలెను.

అంతేకాక, తన స్వంత , వినియోగ గమ్యస్థానమునకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేసికొనుటకు క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటును స్థాపించుకున్నట్టి వ్యక్తికి ప్రవేశ సౌలభ్యము సమకూర్చబడిన సందర్భములో అట్టి సర్ ఛార్జీ విధించబడరాదు.

40.(ఎ) సనుర్థవంతమైన, సమన్వయపరచిన మరియు మితవ్యయమగు అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థ లేక సందర్భానుసారముగా రాజ్యములో ప్రసార వ్యవస్థను నిర్మించుట, నిర్వహించుట మరియు నడుపుట;

(బి) ప్రాంతీయ, లోడ్ డిస్పాచ్ కేంద్రము మరియు సందర్భానుసారముగా రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క ఆదేశములను పాటించుట;

(సి) తన ప్రసార వ్యవస్థను వినియోగించుట కొరకు విచక్షణారహితమైన ప్రవేశ సౌలభ్యమును సమకూర్చుట ద్వారా;

(i) ప్రసార ఛార్జీల చెల్లింపు పై ఎవరేని లైసెన్సుదారుడికి లేక ఉత్పాదన కం పెనీకి; లేక

(ii) రాజ్య కమీషనుచే నిర్ధిష్టపరచబడునట్టి విధముగా ప్రసార ఛార్జీలు మరియు వాటిపై సర్ ఛార్జీ చెల్లింపు పై 42వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (2) క్రింద ఎవరేని వినియోగదారునికి రాజ్య కమీషను చే అట్టి ప్రవేశ సౌలభ్యము సమకూర్చబడినపుడు ఎపుడైనను

ప్రసార లైసెన్సుదారు కర్తవ్యమై యుండును.

అయితే, అట్టి సర్ ఛార్జీని ప్రస్తుత స్థాయి ఎదురు సబ్సిడీ అవసరములను భరించు నిమిత్తము వినియోగించవలెను.

అంతేకాక, అట్టి సర్ ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీలను సముచిత కమీషను చేత నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో క్రమంగా తగ్గించవలెను.