పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

... 277627. (3) సముచిత 'కమీషను, ఉప-పరిచ్ఛేదము (1) క్రింద పరిపాలకుడి నియామకము జరిగిన ఒక సంవత్సరము లోపల, 9వ పరిచ్చేదములో ఉన్నట్టి నిబంధనలననుసరించి లైసెన్సును ప్రతి సంహరించవలెను లేదా సందర్భానుసారముగ లైసెన్సు సస్పెన్షనును ప్రతిసంహరించవలెను మరియు ఏ పంపిణీ లైసెన్సుదారుని లైసెన్సు సస్పెండు చేయబడినదో ఆ పంపిణీ లైసెన్సుదారుకు వినియోగమును పునరుద్ధరించవలేను.

(4) సముచిత కమీషను, ఉప-పరిచ్ఛేదము (3) క్రింద లైసెన్సును ప్రతిసంహరించిన సందర్భములో, పంపిణీ లైసెన్సుదారుని వినియోగము, 20వ పరిచ్చేదము యొక్క నిబంధనలననుసరించి లైసెన్సు ప్రతి సంహరించబడిన తేదీ నుండి ఒక సంవత్సరము కాలావధి లోపల విక్రయించబడవలెను మరియు వినియోగముల విక్రయమునకైన పరిపాలన పరమైన మరియు ఇతర ఖర్చులను తగ్గించుకున్న తరువాత పంపిణీ లైసెన్సుదారుకు ఆ ధర యొక్క డబ్బును పంపివలెను.

భాగము - 5

విద్యుచ్ఛక్తి ప్రసారము

అంతర్ రాజ్య ప్రసారము

25. ఈ భాగము నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము, ప్రాంతాలవారీగా దేశ సరిహద్దులను నిర్ణయించవచ్చును. మరియు విద్యుచ్ఛక్తి యొక్క సమీకృత ప్రసారము మరియు సరఫరాను సమర్థవంతముగాను మితవ్యయముతో చేయుటకు మరియు ప్రత్యేకించి స్వచ్ఛంద అంతర్ కనెక్షన్లకు వీలు కల్పించుటకు మరియు అంతర్ రాజ్య, ప్రాంతీయ మరియు అంతర్ ప్రాంతీయ విద్యుచ్ఛక్తి ఉత్పాదన మరియు ప్రసారమునకు సౌకర్యముల సమన్వయము కొరకు ఎప్పటికప్పుడు వాటిలో అది అవసరమని భావించునట్టి మార్పులను చేయవచ్చును.

26.(1) కేంద్ర ప్రభుత్వము, అత్యంతానుకూల కాల నిర్ణయ పట్టికలు మరియు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రముల మధ్య విద్యుచ్ఛక్తి డిస్పాచ్ కొరకు జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రముగా పిలువబడు కేంద్రము నొకదానిని జాతీయ స్థాయిలో స్థాపించవలెను.

(2) జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క ఏర్పాటు మరియు కృత్యములు కేంద్ర ప్రభుత్వముచే విహితపరచబడునట్టి విధముగా ఉండవలెను.

అయితే, జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము. విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో నిమగ్నము కారాదు.