పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

151 G15


అయితే, అట్టి ప్రవేశ సౌలభ్యము. (ఓపెన్ యాక్సెస్) తగినంత ప్రసార సౌకర్యం లభ్యతకు లోబడి ఉంటుంది మరియు అట్టి ప్రసార సౌకర్య లభ్యత కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్య ప్రసార వినియోగముచే నిర్ధారించబడవలెను.

అంతేకాక, ప్రసార సౌకర్యం లభ్యతను గూర్చిన ఏదేని వివాదము సముచిత కమీషనుచే అధి నిర్ణయించబడవలెను.

ఉత్పాదన
కంపెని
విధులు

10:(1) ఈ చట్టపు నిబంధనలకు లోబడి. ఈ చట్టము లేక దాని క్రింద చేయబడిన నియమములు లేక వినియమములననుసరించి ఉత్పాదక స్టేషన్లను, టై లైన్లను, సబ్ స్టేషన్లను మరియు వాటికి జోడించబడిన ప్రసార లైన్లను నెలకొల్పుట, నడుపుట మరియు నిర్వహించుట ఉత్పాదక కంపెనీ యొక్క విధులై ఉండును.

(2) ఉత్పాదక కంపెనీ, ఈ చట్టము మరియు దాని క్రింద చేయబడిన నియమములు లేక వినియమములననుసరించి ఎవరేని లైసెన్సుదారుకు విద్యుచ్చక్తి సరఫరా చేయవచ్చును. మరియు 42వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (2) క్రింద చేసిన వినియమములకు లోబడి ఎవరేని వినియోగదారునికి విద్యుచ్ఛక్తి సరఫరా చేయవచ్చును.

(3) ప్రతి ఉత్పాదక కంపెనీ,

(ఎ) తమ ఉత్పాదక స్టేషన్లకు సంబంధించిన సాంకేతిక వివరములను సముచిత కమీషను మరియు ప్రాధికార సంస్థకు సమర్పించవలెను;

(బి) ఆది. ఉత్పాదన చేసిన విద్యుచ్ఛక్తి ప్రసారము కొరకు కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్య ప్రసార వినియోగముతో సమన్వయము చేయవలెను.

ఉత్పాదక
కంపెనీలకు
ఆదేశములు

11 (1) సముచిత ప్రభుత్వము, ఉత్పాదక కం పెనీ, అసాధారణ పరిస్థితులలో ఆ ప్రభుత్వ ఆదేశములననుసరించి ఏదేని ఉత్పాదన స్టేషనును నడుపమనియు మరియు నిర్వహించుమనియు నిర్దిష్ట పరచవచ్చును.

విశదీకరణ: - ఈ పరిచ్చేదము నిమిత్తము "అసాధారణ పరిస్థితులు " అనగా రాజ్య భద్రత, ప్రజాశాంతికి ఏర్పడిన ప్రమాదము నుండి ఉత్పన్నమైన పరిస్థితులు లేక ప్రకృతి వైపరీత్యము - లేక ప్రజాహితము నుండి ఉత్పన్నమైన ఇతర పరిస్థితులు అని అర్థము.

(2) సముచిత కమీషను, ఉప-పరిచ్చేదము (1)లో నిర్దేశించిన ఆదేశముల వలన ఏదేని ఉత్పాదక కంపెనీకి వాటిల్లిన ప్రతికూల విత్తీయ ప్రభావమును తాము సముచితమని భావించునట్టి రీతిలో సమతుల్యము చేయవచ్చును.

* విద్యుచ్ఛక్తి సవరణ చట్టము, 2007లోని 3వ పరిచ్చేదము ద్వారా 15-6-2007 నుండి చొప్పించబడినది.