పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

. 132/6132. (బి) భారత విద్యుచ్ఛక్తి చట్టము, 1910 యొక్క 12 నుండి 18 వరకు గల పరిచ్చేదములలో యున్నట్టి నిబంధనలు మరియు దాని క్రింద చేసిన నియమములు ఈ చట్టము యొక్క 67 నుండి 69 వరకు గల పరిచ్చేదముల క్రింద నియమములు, చేయునంత వరకు అమలు కలిగి వుండవలెను;

(సి) భారత విద్యుచ్ఛక్తి చట్టం, 1910 యొక్క 37వ పరిచ్ఛేదము క్రింద చేయబడిన భారత విద్యుచ్ఛక్తి నియమములు, 1956, ఈ చట్టము యొక్క 53వ పరిచ్ఛేదము క్రింద వినియములు చేయునంత వరకు, అట్టి రద్దుకు ముందు ఉన్నట్లే అమలులో కొనసాగవలెను:

(డి) విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టం, 1948 యొక్క 69వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (1) క్రింద చేసిన నియమములన్నియు, అట్టి నియమములు రద్దు చేయునంత వరకు లేదా సందర్భానుసారంగా మార్పు చేయునంత వరకు అమలులో కొనసాగవలెను.

(ఇ) ఈ చట్టము ప్రారంభమునకు ముందు, అనుసూచిలో నిర్దిష్ట పరచబడిన శాసనముల క్రింద రాజ్య ప్రభుత్వముచే జారీ చేయబడిన అన్ని ఆదేశములు రాజ్య ప్రభుత్వముచే అట్టి ఆదేశములు జారీ చేయబడునంత కాలావధితోపాటు వర్తించుట కొనసాగవలెను.

(3) ఈ చట్టపు నిబంధనలకు అసంగతము కాకుండ, అనుసూచిలో నిర్దిష్ట పరచ బడిన శాసనముల నిబంధనలు అట్టి శాసనములు వర్తించు రాజ్యములకు వర్తింప చేయవలెను.

(4) కేంద్ర ప్రభుత్వము, అవసమని భావించినపుడు, అధి సూచన ద్వారా అనుసూచిని సవరించవచ్చును.

(5) . ఉప-పరిచ్చేదము (2)లో, ఇతర విధముగా నిబంధించబడిననే తప్ప ఆ పరిచ్చేదములో రద్దుల ప్రభావానికి సంబంధించిన ప్రత్యేకమైన విషయముల ప్రస్తావన, సాధారణ ఖండముల చట్టం, 1897 యొక్క 6వ పరిచ్చేదపు సాధారణ వర్తింపునకు భంగము కలిగించదు లేదా ప్రభావము చూపదు.