పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ - 131/ 6131 2 (3) ఈ చట్టము క్రింద రాజ్య కమీషనుచే చేయబడిన వినియమములన్నియు పూర్వ ప్రచురణ షరతులకు లోబడి ఉండవలెను.

182. రాజ్య ప్రభుత్వముచే చేయబడిన ప్రతి నియమము మరియు రాజ్య కమీషనుచే చేయబడిన ప్రతి వినియమము, దానిని చేసిన పిమ్మట, రాజ్య శాసన మండలి శాసనమండలి ఉభయ సదనములు కలిగియున్న యెడల దాని ప్రతి యొక సదనము సమక్షమున లేదా అట్టి శాసన మండలి ఒక సదనమును కలిగియున్నచో ఆ సదనము సమక్షమున ఉంచనలెను.

183.(1) ఈ చట్టపు నిబంధనలను అమలు జరుపుట యందు ఏదైన చిక్కు ఏర్పడినచో, కేంద్రప్రభుత్వము, ప్రచురించిన ఉత్తర్వు ద్వారా, ఈ చట్టపు నిబంధనలకు అసంగతము కాకుండ ఆ చిక్కును తొలగించుటకై ఆవశ్యకమని తమకు తోచునట్టి నిబంధనలను చేయవచ్చును:

అయితే, ఈ చట్టము ప్రారంభపు తేదీ నుండి రెండు సంవత్సరములు ముగిసిన పిమ్మట ఈ పరిచ్ఛేదము క్రింద ఏ ఉత్తర్వును చేయరాదు.

(2) ఈ పరిచ్చేదము క్రింద చేసిన ప్రతి ఉత్తర్వు దానిని చేసిన పిమ్మట వెంటనే పార్లమెంటు ప్రతి యొక్క సదనముల సమక్షమున ఉంచవలెను.

184. రక్షణ, అణు ఇంధనముతో వ్యవహరించు మంత్రిత్వ శాఖ లేదా కేంద్ర ప్రభుత్వ విభాగము లేదా అదేవిధమైన అట్టి ఇతర పోలిన మంత్రిత్వ శాఖలు, లేదా విభాగములు లేదా కేంద్ర ప్రభుత్వముచే అధి సూచించబడునట్టి మంత్రిత్వ శాఖలు లేదా విభాగముల నియంత్రణ క్రింద అధీనస్థలు, బోర్డులు లేదా సంస్థలకు ఈ చట్టపు నిబంధనలు వర్తించవు.

185.(1) ఈ చట్టములో ఇతర విధముగా నిబంధించబడిన నే తప్ప, భారత విద్యుచ్ఛక్తి చట్టము, 1910, విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 మరియు విద్యుచ్ఛక్తి రెగ్యులేటరీ కమీషనుల చట్టము, 1998 ఇందుమూలముగా రద్దు చేయడమైనది.

(2) అట్టి రద్దు ఉన్నప్పటికినీ,

(ఎ) ఈ చట్టపు నిబంధనలకు అసంగతముగాకుండునంత వరకు, రద్దు చేయబడిన శాసనముల క్రింద చేసిన లేదా జారీ చేయబడిన ఏదేని నియమము, అధి సూచన, తనిఖీ, ఉత్తర్వు లేదా నోటీసు లేదా చేసిన ఏదేని నియామకము, స్థిరీకరణ. లేదా ప్రఖ్యాపన లేదా మంజూరు చేసిన ఏదేని లైసెన్సు, అనుమతి, ప్రాధికృతము లేదా మినహాయింపు లేదా వ్రాసిన ఏదేని దస్తావేజు లేదా పత్రము లేదా ఇచ్చిన ఏదేని ఆదేశముతో సహా చేసిన ఏదేని పని లేదా తీసుకొన్న ఏదేని చర్య లేదా చేయుటకు లేదా తీసుకొనుటకు ఉద్దేశించిన ఏదేని ఈ చట్టమునకు తత్తుల్యమైన నిబంధనల క్రింద పనిని లేదా చర్యను చేసినట్లు లేక తీసుకొన్నట్లు భావించవలెను: