పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ (జెడ్-బి) 59వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సుదారుచే ఏ కాలావధి లోపల సమాచారము సమర్పించబడునో ఆ కాలావధి:

(జెడ్-సి) 61వ పరిచ్ఛేదములోని ఖండము (జి) క్రింద ఎదురు సబ్సిడీల తగ్గింపు కొరకైన రీతి;

(జెడ్-డి) 61వ పరిచ్ఛేదము క్రింద టారిఫ్ నిర్ధారణ కొరకు నిబంధనలు మరియు షరతులు;

(జెడ్-ఇ) 62వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీచే సమకూర్చబడు వివరములు;

(జెడ్-ఎఫ్) 62వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (5) క్రింద టారిఫ్ మరియు ఛార్జీల నుండి ఆశిస్తున్న రెవిన్యూ లెక్కింపునకుగాను విధానములు మరియు ప్రక్రియలు:

(జెడ్-జి) 64వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య కమీషను సమక్షమున దరఖాస్తు చేయు రీతి మరియు దానికై చెల్లించవలసిన ఫీజు:

(జెడ్-హెచ్) 64వ పరిచ్చేదపు, ఉప పరిచ్ఛేదము (3) క్రింద మార్పులు లేదా షరతులతో టారిఫ్ ఉత్తర్వు జారీ;

(జెడ్-ఐ) 66వ పరిచ్చేదము క్రింద నిర్దిష్ట పరచబడిన వర్తకమును కలుపుకొని విద్యుచ్ఛక్తిలో మార్కెటు అభివృద్ధి చేయు రీతి;

(జెడ్-జె) 91వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య కమీషను కార్యదర్శి యొక్క అధికారములు మరియు కర్తవ్యములు:

(జెడ్-కె) 91వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద రాజ్య కమీషను యొక్క కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగస్తుల సేవా నిబంధనలు మరియు షరతులు;

(జెడ్-ఎల్) 92వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (1) క్రింద వ్యాపార లావాదేవీల ప్రక్రియా నియమావళి,

(జెడ్-ఎమ్) 128వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (8) క్రింద లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ నిర్వహించబడు కనీస సమాచారము మరియు అట్టి సమాచారము నిర్వహించవలసిన రీతి;

(జెడ్-ఎన్} 130వ పరిచ్ఛేదము క్రింద నోటీసు తామీలు మరియు ప్రచురణ చేయు రీతి;

(జెడ్-ఒ) 127వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (1) క్రింద అపీలు దాఖలు చేయు ప్రరూపము, అట్టి ప్రరూపమును. సత్యాపన చేయవలసిన రీతి మరియు అప్పీలు దాఖలు కొరకైన ఫీజు,

(జెడ్-పి) నిర్దిష్ట పరచుటకు అవసరమైన లేదా నిర్దిష్ట పరదగు ఏదేని ఇతర విషయము