పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________ . 128/ G128 (ఎన్) 171వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము. (1) క్రింద ప్రతి నోటీసు, ఉత్తర్వు లేదా దస్తావేజును అంద చేయవలసిన రీతి;

(ఓ) విహితపరచుటకు అవసరమైన లేదా విహితపరచదగు ఏదేని ఇతర విషయం .

181.(1) రాజ్య కమీషనులు, అధిసూచన ద్వారా ఈ చట్టపు నిబంధనలు సాధారణ ముగా అమలు కొరకై, ఈ చట్టము మరియు నియమములకు సంగతమైన వినియమములను చేయవచ్చును.

(2) ప్రత్యేకముగను, మరియు ఉప-పరిచ్చేదము (1)లో పేర్కొనిన అధికార వ్యాపకతకు భంగం లేకుండగను ఈ క్రింది విషయాలన్నింటి కొరకైనను లేదా వాటిలో వేటి కొరకైనను అట్టి వినియమములు చేయవచ్చును, అవేవనగా:-

(ఎ) 14వ పరిచ్చేదమునకు గల మొదటి వినాయింపు క్రింద నిర్దిష్ట పరచబడు కాలావధి;

(బి) 15వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద దరఖాస్తు ప్రరూపము మరియు రీతి:

(సి) 15వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (2) క్రింద ప్రచురించబడు. లైసెన్సు కొరకైన దరఖాస్తు రీతి మరియు వివరములు:

(డి) 16న పరిచ్ఛేదము క్రింద లైసెన్సు షరతులు;

(ఇ) 18వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (2) యొక్క ఖండము (ఎ) క్రింద నోటీసు ప్రరూపము మరియు వివరములు;

(ఎఫ్) 18వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (2) యొక్క ఖండము (సి) క్రింద లైసెన్సు చేయవలసిన మార్పులు లేదా సవరణల ప్రచురణ;

(జి) 32వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (3) క్రింద ఉత్పాదక కం పెనీలు లేదా లైసెన్సుదారుల నుండి ఫీజు మరియు ఛార్జీల విధింపు మరియు వసూలు:

(హెచ్) 36వ పరిచ్ఛేదమునకు గల వినాయింపు క్రింద అంతరాగతమైయున్న ప్రసార సౌకర్యములకు సంబంధించిన రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతులు;

(ఐ) 39వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (2) యొక్క (డి) యొక్క ఉప ఖండము (ii) క్రింద ప్రసార ఛార్జీలు మరియు సర్-ఛార్జీ, చెల్లింపు;

(జె) 39వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (2) యొక్క ఖండము (డి)లోని ఉప ఖండము(ii)కు రెండవ వినాయింపు క్రింద సర్-ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు: