పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ - 1261 G126 (ఎక్స్) 64వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (3) క్రింద మార్పులు లేదా షరతులతో టారిఫ్ ఉత్తర్వు జారీ:

(వై) 66వ పరిచ్ఛేదము క్రింద నిర్దిష్ట పరచబడిన వర్తకముతో కలుపుకొని విద్యుచ్ఛక్తిలో మార్కెటు అభివృద్ధి చేయు రీతి;

(జెడ్) 91వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద కేంద్ర కమీషను యొక్క కార్యదర్శి అధికారములు మరియు కర్తవ్యములు;

(జెడ్-ఎ) 91వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్చేదము (3) క్రింద కేంద్ర కమీషను యొక్క కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగుల సేవా నిబంధనలు ఆమె మరియు షరతులు:

(జెడ్-బి) 92వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (1) క్రింద వ్యాపార వ్యవహారము కొరకు ప్రక్రియా నియమావళి:

(జెడ్-సి) 128వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (8) క్రింద లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీచే నిర్వహించవలసియున్న కనీస సమాచారము మరియు అట్టి సమాచారమును నిర్వహించవలసియున్న రీతి:

(జెడ్-డి) 130వ పరిచ్చేదము క్రింద నోటీసు తామీలు మరియు ప్రచురణ చేయు రీతి:

(జెడ్-ఇ) వినియమములచే నిర్దిష్ట పరచబడు లేదా నిర్దిష్ట పరచవలసిన ఏదేని ఇతర విషయము.

(3) ఈ చట్టము క్రింద కేంద్ర కమీషను ద్వారా చేయబడిన వినియమములన్నియు పూర్వ ప్రచురణ షరతులకు లోబడి ఉండవలెను.

179. కేంద్రప్రభుత్వముచే చేయబడిన ప్రతినియమము, ప్రాధికార సంస్థ చే చేయబడిన ప్రతి వినియమము మరియు కేంద్ర కమీషనుచే చేయబడిన ప్రతి వినియమము, దానిని చేసిన పిమ్మట వీలైనంత త్వరగా పార్లమెంటు అధివేశములోనున్న సమయమున మొత్తం ముప్పది దినముల కాలావధి పాటు దాని ప్రతియొక సదనము సమక్షమునను ఉంచవలెను. అట్టి కాలావధి ఒకే అధివేశనంలో గాని వరుసగా వచ్చు రెండు లేక అంత కెక్కువ అధివేశనములలోగాని చేరి యుండవచ్చును. మరియు పైన చెప్పిన ఆధివేశనమునకు లేక వరుసగా వచ్చు అధివేశనములకు వెనువెంటనే వచ్చు అధివేశనం ముగియుటకు పూర్వమే ఆ నియమములో లేదా వినియమములో ఏదేని మార్పు చేయుటకు ఉభయ సదనములు అంగీకరించినచో లేక నియమమును లేక వినియమమును చేయరాదని ఉభయసదనములు అంగీకరించినచో, అటు పిమ్మట ఆ నియమము లేక వినియమము అట్లు మార్పు చేసిన రూపంలో మాత్రమే ప్రభావం కలిగియుండును. లేక సందర్భానుసారముగా ప్రభావరహితమై యుండును. అయినప్పటికినీ ఏదేని అట్టి మార్పుగాని, రద్దుగాని అంతకు పూర్వం ఆ నియమము లేక వినియమము క్రింద చేసిన దేని శాసన మాన్యతకైనను భంగం కలిగించదు.