పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________ ... 125 G 125 (ఐ) 36వ పరిచ్ఛేదమునకు గల వినాయింపు క్రింద అంతరాగతమై ఉన్న ప్రసార సౌకర్యములకు సంబంధించిన రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతులు;

(జె) 38వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) యొక్క ఖండము. (డి)లోని ఉప ఖండము (ii) క్రింద ప్రసార ఛార్జీలు మరియు సర్ ఛార్జీ చెల్లింపు:

(కె) 38వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (2)లోని ఖండము (డి) యొక్క ఉప ఖండము (ii)కు గల రెండవ వినాయింపు క్రింద సర్ ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు;

(ఎల్) 40వ పరిచ్ఛేదపు ఖండము (సి) యొక్క ఉప ఖండము (ii) క్రింద ప్రసార ఛార్జీలు మరియు సర్ ఛార్జీల మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు;

(ఎమ్) 40వ పరిచ్చేదపు ఖండము (సి) యొక్క ఉప ఖండము. (ii)కు గల రెండవ వినాయింపు క్రింద సర్-ఛార్జీల మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు;

(ఎన్) 41వ పరిచ్ఛేదమునకు గల వినాయింపు క్రింద ప్రసార మరియు వీలింగు ఛార్జీల తగ్గింపు కోరకుగాను ఉపయోగింపబడు ఇతర వ్యాపారము నుండి వచ్చిన రెవిన్యూ యొక్క అనుపాతము;

(ఓ) 52వ పరిచ్చేదము యొక్క ఉప పరిచ్ఛేదము (2) క్రింద విద్యుచ్ఛక్తి వర్తకుని కర్తవ్యములు;

(పి) 57వ - పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సుదారు లేదా లైసెన్సుదారుల వర్గము యొక్క నిర్వర్తనా ప్రమాణాలు:

(క్యు) 59వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సుదారుచే ఏ కాలావధి లోపుగా సమాచారమును సమకూర్చవలసియున్నదో ఆ కాలావధి:

(ఆర్) 61వ సరిచ్చేదములోని ఖండము (జి) క్రింద ఎదురు సబ్సిడీల తగ్గింపు కోరకైన రీతి:

(ఎస్) 61వ పరిచ్ఛేదము క్రింద టారిఫ్ నిర్ధారణ కొరకు నిబంధనలు మరియు షరతులు:

(టి) 62వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ చే సమకూర్చవలసియున్న వివరములు;

(యు) 62వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (5) క్రింద టారిఫ్ మరియు ఛార్జీల నుండి ఆశించిన రెవిన్యూ లెక్కింపు ప్రక్రియలు;

(వి) 64వ పరిచ్ఛేదపు ఉప పరిచ్చేదము (1) క్రింద కేంద్ర కమీషనుకు దరఖాస్తు చేసుకొను రీతి మరియు దాని కొరకు చెల్లించవలసిన ఫీజు:

(డబ్ల్యు) 64వ పరిచ్చేదము యొక్క ఉప పరిచ్ఛేదము (2) క్రింద దరఖాస్తు యొక్క ప్రచురణ రీతి: