పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ ...1231 G123 (ఎస్) 119వ పరిచ్చేదపు ఉప సరిచ్ఛేదము (3) క్రింద అప్పీలు ట్రిబ్యునలు యొక్క అధికారుల మరియు ఉద్యోగుల జీతభత్యములు మరియు ఇతర సేవా షరతులు;

(టి) 120వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (2) యొక్క ఖండము. (ఐ), క్రింద అప్పిలేటు ట్రిబ్యునలు వినియోగించవలసియున్న 'సివిలు న్యాయస్థానపు అధికారములకు సంబంధించి అదనపు విషయములు:

(యు) 127వ పరిచ్చేదపు, ఉప-పరిచ్చేదము (1) క్రింద అప్పీలు దాఖలు చేయవలసిన ప్రాధికారి:

(వి) 143వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద న్యాయ నిర్ణయాధికారిచే విచారణ జరుగు రీతి:

(డబ్ల్యూ) 161వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) నిమిత్తము ఎవరేని వ్యక్తికి లేక కేంద్ర ప్రభుత్వమునకు నోటీసులు అందజేయ వలసిన ప్రరూపము మరియు సమయము;

(ఎక్స్) 162వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ఇన్ స్పెక్టర్లచే వినియోగించవలసిన అధికారములు మరియు నిర్వర్తించవలసిన కృత్యములు;

(వై) 171వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద అందజేయవలసిన ప్రతి యొక్క నోటీసు, ఉత్తర్వు లేదా దస్తావేజు యొక్క బట్వాడా రీతి;

(జెడ్) అవసరమైన లేదా విహితపరచబడునట్టి ఏదేని ఇతర విషయము.

177. (1) ప్రాధికార సంస్థ అధిసూచన ద్వారా ఈ చట్టము యొక్క నిబంధనలను సాధారణముగా అమలు చేయుటకై ఈ చట్టము మరియు నియమములకు సంగతమైన వినియమములను చేయవచ్చును.

(2) ప్రత్యేకముగను మరియు ఉప-పరిచ్చేదము (1)లో ప్రదత్తము చేయబడిన సాధారణత అధికార వ్యాపకతకు భంగం లేకుండను ఈ క్రింది విషయములన్నింటి కొరకైనను లేదా వాటిలో వేటి కొరకైనను అట్టి వినియమములు చేయవచ్చును. అవేవనగా:-

(ఎ) 34వ పరిచ్ఛేదము క్రింద గ్రిడ్ ప్రమాణాలు:

(బి) 53వ పరిచ్చేదము క్రింద భద్రత మరియు విద్యుత్ సరఫరాకు సంబంధించి ఉపయుక్తమైన పరిమాణములు:

(సి) 55వ పరిచ్ఛేదము క్రింద మీటర్ల ప్రతిష్ఠాపన మరియు నిర్వహణ:

(డి) 70వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (9) క్రింద వ్యవహార లావాదేవీల కొరకైన నియమముల ప్రక్రియ;