పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

_______________ -122/61220 (ఎఫ్) 68వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (2) యొక్క ఖండము (సి) క్రింద విహితపరచబడినట్టి ఇతర విషయములు:

(జి) 70వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (14) క్రింద ప్రాధికార సంస్థ యొక్క సమావేశములు హాజరు కొరకుగాను ఇతర సభ్యులకు చెల్లించవలసిన భత్యములు మరియు ఫీజు:

(హెచ్) 70వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (15) క్రింద ప్రాధికార సంస్థ యొక్క ఛైర్-పర్సన్ మరియు సభ్యుల సర్వీసు, ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు:

(ఐ) 73వ పరిచ్చేదము క్రింద కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ యొక్క కృత్యములు మరియు విధులు;

(జె) 89వ పరిచ్ఛేదవు. ఉప-పరిచ్ఛేదము (2) క్రింద చైర్ పర్సన్ మరియు కేంద్ర కమీషను సభ్యుని జీతభత్యములు మరియు ఇతర సేవా షరతులు;

(కె) 89వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (3) క్రింద ఏ ప్రాధికారి సమక్షమున పదవీ మరియు రహస్య గోపనీయ ప్రమాణములను చేవ్రాలు చేయబడవలెనో ఆ ప్రాధికారి మరియు దాని యొక్క ప్రరూపము మరియు రీతి;

(ఎల్) 90వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (2)కు గల వినాయింపు క్రింద కేంద్ర ప్రభుత్వముచే విహితపరచబడునట్టి ప్రక్రియ:

(ఎమ్) 94వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (జి) క్రింద విహిత పరచబడుటకు అవసరమైనట్టి ఏదేని ఇతర విషయము:

(ఎన్) కేంద్ర కమీషను 100వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (1) క్రింద తయారు చేయవలసిన తన వార్షిక లేక్కల వివరణ ప్రరూపము;

(ఒ) కేంద్ర కమీషను, 101వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద తన వార్షిక నివేదికను తయారు చేయవలసిన ప్రరూపము మరియు సమయము;

(పి) కేంద్ర కమీషను, 106వ పరిచ్ఛేదము క్రింద తన బడ్జెటును తయారు చేయవలసిన ప్రరూపము మరియు సమయము;

(క్యూ) అట్టి ప్రరూపమును సత్యాపనచేయు ప్రరూపము మరియు రీతి మరియు 111వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద అపీలు దాఖలుచేయుట కొరకైన ఫీజు:

(ఆర్) 115వ పరిచ్ఛేదము క్రింద అప్పీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ మరియు అప్పీలు ట్రిబ్యునలు యొక్క సభ్యులకు చెల్లించవలసిన జీత భత్యములు మరియు ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు: