పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 1211 G121 173. ఈ చట్టము లేదా దానిక్రింద చేయబడిన ఏదేని నియమము లేదా వినియమములో సున్నదేదియు లేదా ఈ చట్టము, నియమము లేదా వినియమము మూలముగా ప్రభావము కలిగియున్న ఏదేని పత్రము, వినియోగదారుని సంరక్షణ చట్టం, 1986 లేదా ఇంధన శక్తి చట్టం, 1962 లేదా రైల్వేల చట్టం, 1989 యొక్క ఏవేని ఇతర నిబంధనలతో అసంగతము అయినంత మేరకు ప్రభావం కలిగియుండదు.

174. 173వ పరిచ్చేదములో ఇతర విధముగా నిబంధించబడిననే తప్ప, ఈ చట్టపు నిబంధనలు, తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము లేక ఈ చట్టము కాని ఇతర శాసనము మూలముగా ప్రభావము కలిగినట్టి ఏదేని పత్రములో ఇందుకు అసంగతముగా ఏ మున్నప్పటికిని అమలు కలిగియుండదు.

175. ఈ చట్టపు నిబంధనలు తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములకు అదనంగాను మరియు న్యూనత పరచనవిగాను ఉండును.

176.(1) కేంద్ర ప్రభుత్వము, అధిసూచన ద్వారా ఈ చట్టము యొక్క నిబంధనల అమలు కొరకై నియమములు చేయవచ్చును.

(2) ప్రత్యేకించి మరియు పైన పేర్కొనిన అధికారము యొక్క వ్యాపకతకు భంగము కలుగకుండా, అట్టి నియమములు అన్నీ లేక ఈ క్రింది ఏవేని విషయములకు నిబంధనలు చేయవచ్చును. అవేవనగా:-

(ఎ) 3వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (4) కు గల వినాయింపు క్రింద ప్రాధికార సంస్థ చే జాతీయ విద్యుచ్ఛక్తి విధాన ముసాయిదా పై ఆక్షేపణలు మరియు సలహాలను ఆహ్వానించవలసిన సమయము;

(బి) 14వ పరిచ్ఛేదమునకు గల ఆరవ వినాయింపు క్రింద అదనపు ఆవశ్యకతలు (తగినంత మూలధనము, పరపతి యోగ్యత లేక ప్రవర్తన నియమావళితోకూడిన);

(సి) 15వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సు మంజూరు కై దరఖాస్తు కొరకు చెల్లించు ఫీజు:

(డి) 26వ పరిచ్చేదవు. ఉప-పరిచ్చేదము (2) క్రింద జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క సంఘటన మరియు కృత్యములు;

(ఇ) 67వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద యజమాని లేదా ఆక్రమణదారు యొక్క అస్తి పై ప్రభావం చూపు లైసెన్సుదారుల చర్యలు: