పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

1171 G117 164. సముచిత ప్రభుత్వము, వ్రాతమూలక ఉత్తర్వు ద్వారా, విద్యుచ్ఛక్తి ప్రసారము కొరకు విద్యుచ్ఛక్తి లైన్లు లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటు ఏర్పాటు కొరకు, లేదా పనులను సముచిత రీతిలో సమన్వయపరచుట కొరకు అవసరమైన టెలిఫోనిక్ లేదా టెలిగ్రాఫిక్ సందేశముల కొరకు, ఎవరేని పబ్లికు అధికారి, లైసెన్సుదారు లేదా ఈ చట్టము క్రింద విద్యుచ్ఛక్తి సరఫరా వ్యవహారంలో నిమగ్నమైయున్న ఎవరేని ఇతర వ్యక్తికి, సముచిత ప్రభుత్వము విధించుట అవసరమని భావించబడినట్టి ఏవేని షరతులు మరియు నిర్బంధనలు మరియు భారత టెలిగ్రాఫ్ చట్టం, 1885 యొక్క నిబంధనలకు లోబడి, టెలిగ్రాఫ్ లైన్లను ఏర్పాటు చేయుటకు మరియు ప్రభుత్వము చే స్థాపించిన లేదా నిర్వహించిన లేదా స్థాపించబడు లేదా నిర్వహించబడు టెలిగ్రాఫ్ ప్రయోజనముల నిమిత్తం పదవులకు సంబంధించి ఆ చట్టము క్రింద టెలిగ్రాఫ్ ప్రాధికారి కలిగియున్న ఏవేని అధికారములను ప్రదత్తము చేయవచ్చును.

165.(1) భూసేకరణ చట్టం, 1894 యొక్క 40వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (బి) మరియు 41వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (5)లో, "పని" అను పదము నిర్మితమగు పని ద్వారా విద్యుచ్ఛక్తి సరఫరా లేదా సరఫరా చేయబడుటలో చేరియున్నదని భావింపబడవలెను;

(2) సముచిత ప్రభుత్వము, ఈ విషయమై సముచిత కమీషను సిఫారసు పై, ఈ ప్రయోజనముల కొరకు ఏదేని స్థలమును పొందు వాంఛగల కంపెనీ కానట్టి ఎవరేని వ్యక్తి ఆ ఆ దరఖాస్తుమీద, తాను సబబని భావించినచో, సదరు వ్యక్తి కం పెనీ వలె దానిని అదే రీతిలో మరియు ఆవేషరతులలో అతడు భూసేకరణ చట్టం 1894 నిబంధనల క్రింద ఆర్జించవచ్చునని ఆదేశించవచ్చును.

బాగము-18

వివిధములు

166.(1) కేంద్ర ప్రభుత్వము, దేశములోని విద్యుత్ విధానమును మృదువుగా, సమన్వయంతో అభివృద్ధి చేయుటకు గాను, కేంద్ర కమీషను చైర్ పర్సన్ మరియు దాని యొక్క సభ్యులు, ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సను, ఉత్పాదక కంపెనీల ప్రతినిధులు మరియు అంతర్ రాజ్య విద్యుత్ ప్రసారములో నిమగ్న మైయున్న ప్రసార లైసెన్సుదారు లతో కూడియున్న సమన్వయ వేదిక నొకదానిని సంఘటితము చేయవలెను.

(2) కేంద్ర ప్రభుత్వము, కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సను మరియు రాజ్య కమీషనుల చైర్ పర్ససులతో కూడియున్న క్రమబద్ధీకరణదారుల వేదికనొక దానిని కూడా సంఘటితము చేయవలెను.