పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________

105/G105. 145. నిర్ధారించుటకుగాను ఈ చట్టము ద్వారా లేదా దాని క్రింద 126న పరిచ్ఛేదములో నిర్దేశించిన నిర్ధారణ అధికారి లేదా 127వ పరిచ్ఛేదము క్రింద నిర్దేశించిన అప్పీలు ప్రాధికారి లేదా ఈ చట్టము క్రింద నియమించబడిన న్యాయ నిర్ణయాధికారికి అధికారమీయబడిన ఏదేని విషయమునకు సంబంధించి ఏ సివిలు న్యాయస్థానము ఏదేని దావా లేదా చర్యను స్వీకరించుటకు. అధికారితా పరిధిని కలిగియుండదు మరియు ఈ చట్టము ద్వారా లేదా దానిక్రింద ప్రదత్తము చేయబడిన ఏదేని అధికారమును అనుసరించి తీసుకొనిన లేదా తీసుకొనవలసిన ఏదేని చర్యకు సంబంధించి ఏదేని న్యాయస్థానము లేదా ఇతర ప్రాధికారిచే ఈ వ్యాదేశము మంజూరు చేయబడరాదు.

146. ఈ చట్టము క్రింది ఏదేని ఉత్తర్వు లేదా ఆదేశమును సదరు ఉత్తర్వు లేదా ఆదేశములో నిర్దిష్టపరచబడినట్టి కాలావధి లోపల పాటించుటలో వైఫల్యం చెందిన లేదా ఉల్లంఘించిన లేదా ఈ చట్టము యొక్క ఏవేని నిబంధనలు లేదా దానిక్రింద చేయబడిన ఏవేని నియమములు లేదా వినియమములను ఉల్లంఘించుటకు ప్రయత్నించిన లేదా దుష్ప్రరణ చేసిన వారేవరైనను మూడు నెలల వరకు పొడింగింపగల కాలావధితోను లేదా లక్ష రూపాయల దాకా ఉండగల జుర్మానాతోను లేదా ప్రతియొక అపరాధమునకు సంబంధించి రెండింటిలోను మరియు వైఫల్యం కొనసాగుతున్న విషయంలో అట్టి మొదటి అపరాధము నకై దోషస్థాపన జరిగిన తరువాత వైఫల్యం కొనసాగుతున్న సమయంలో ప్రతియొక రోజుకు ఐదువేల రూపాయలదాకా ఉండగల అదనపు జుర్మానాలో శిక్షింపబడ వలెను.

అయితే, ఈ పరిచ్చేదములో నున్నదేదియు 121వ పరిచ్ఛేదము క్రింద జారీచేయబడిన ఉత్తర్వులు, అను దేశములు లేదా ఆదేశములకు వర్తించదు.

147. ఈ చట్టము క్రింద విధించబడిన శిస్తులు, నష్టపరిహారము చెల్లింపుకు సంబంధించి ఏదేని దాయిత్వమునకు లేదా లైసెన్సుదారు విషయంలో నేరస్థుడు భరించవలసిన అతని లైసెన్సు ప్రతిసంహరణకు అదనముగాను మరియు న్యూనపరచకుండా ఉండవలెను.

148. ఈ చట్టము యొక్క నిబంధనలు, అని వర్తించునంత వరకు, సముచిత ప్రభుత్వము చే సరఫరా చేయబడిన విద్యుచ్ఛక్తి లేదా దానికి చెందిన పనుల విషయంలో ఆ చట్టము క్రింద శిక్షింపబడు కార్యములు చేసినపుడు కూడ వర్తించునట్లు భావింపబడవలెను.

149.(1) ఈ చట్టము క్రింద అపరాధమును ఏదేని ఒక కంపెనీ చేసిన యెడల ఆ అపరాధము జరిగినపుడు ఆ కంపెనీ యొక్క బాద్యత లేక ఆ కంపెనీ వ్యాపార నిర్వహణ భారమును వహించి యుండిన ప్రతి వ్యక్తియు మరియు ఆ కంపెనీయు ఆ అపరాధము చేసినట్లు భావించవలెను. మరియు తదనుసారముగా చర్యలు జరుపబడి మరియు శిక్షింపబడుటకు పాత్రుడగును.