పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________

103/6103 (డి) లైసెన్సుదారుకు చెందిన ఏదేని మీటరు, ఇండికేటరు. లేదా ఉపకరణాన్ని విద్వేష పూర్వకముగా హానిచేసిన లేదా ఏదేని అట్టి మీటరు, ఇండికేటరు లేదా ఉపకరణం యొక్క సూచికను బుద్ధిపూర్వకంగా లేదా కపటముతో మార్పు చేసిన లేదా తగురీతిగా రిజిస్టరు చేయుట నుండి ఏదేని అట్టి మీటరు, ఇండికేటరు లేదా ఉపకరణాన్ని నివారించినపుడు

మూడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి కారావాసముతోను లేదా పదివేల రూపాయల దాకా ఉండగల జుర్మానాతోను లేదా రెండింటితోను మరియు అపరాధము జరుగుతున్నపుడు ఐదు వందల రూపాయల దాకా ఉండగల రోజు వారి జుర్మానాతోను శిక్షింపబడవలెను. మరియు ఖండము (ఎ)లో నిర్దేశించబడి నట్టి కలుపుటకు లేదా ఖండము (బి)లో నిర్దేశించబడినట్టి తిరిగి కలుపుటకు లేదా ఖండము (సి)లో నిర్దేశించబడినట్టి సంసూచనను చేయుటకు, ఖండము (డి)లో నిర్దేశించబడినట్టి మార్పు లేదా నివారణను కలిగించుటకు ఏదేనీ సాధనము కలదని ఋజువు చేయబడిన యెడల, మరియు ఆ మీటరు, ఇండికేటరు లేదా ఉపకరణము అది అతని ఆస్తి అయినను లేదా కాకున్నను వినియోగదారుని సంరక్షణలో లేదా నియంత్రణలో ఉన్నపుడు, విరుద్ధముగా నిరూపించబడిననే తప్ప, అట్టి కలుపుట, తిరిగి కలుపుట, సంసూచన, మార్పు, నివారణ లేదా సందర్భానుసారంగా అనుచిత ఉపయోగము అట్టి వినియోగదారుని వలన కలిగినదని పురోభావన చేయపబడవలెను.

139. ఎవరైనా, విద్యుచ్ఛక్తి సరఫరాతో కలిపియున్న ఏదేని సామాగ్రిని నిర్లక్ష్యముతో విరుగగొట్టిన, హానిచేసిన, క్రిందికి విసిరివేసిన లేదా నష్టపరిచిన, పదివేల రూపాయలదాకా ఉండగల జుర్మానాతో శిక్షింపబడవలెను.

140. ఎవరైనా, విద్యుచ్ఛక్తి సరఫరాను నిలుపుటకు ఉద్దేశించిన, ఏదేని విద్యుచ్ఛక్తి సరఫరా లైను లేదా పనులను నిలిపివేసిన లేదా హానిచేసిన లేదా నిలిపి వేయుటకు లేదా హాని చేయుటకు ప్రయత్నించిన, పదివేల రూపాయల దాకా ఉండగల జుర్మానాతో శిక్షింపబడవలెను.

141. ఎవరైనా విద్వేషపూరకముతో ఏదేని సార్వజనిక దీపమును ఆర్పివేసినచో రెండు వేల రూపాయల దాకా ఉండగల జుర్మానాతో శిక్షింపబడవలెను.

142. సముచిత కమీషను సమక్షమున ఎవరేని వ్యక్తిచే ఏదేని ఫిర్యాదు దాఖలు చేసినపుడు లేదా ఈ చట్టము యొక్క ఏవేని నిబంధనలు లేదా దాని క్రింద చేసిన నియమములు లేదా వినియమములను లేదా కమీషనుచే జారీ చేయబడిన ఏదేని ఆదేశమును ఎవరేని వ్యక్తి ఉల్లంఘించినాడని ఆ కమీషను సంతృప్తి చెందిన యెడల, ఈ ఆ విషయములో ఆకర్ణింపబడుటకు. అట్టి వ్యక్తికి అవకాశమునొసగిన తరువాత, సముచిత