Jump to content

పుట:వదరుబోతు.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

137

చతుర్దశి రాకకై యత్యుత్కంఠతో నెదుఱు చూ- చును; మునుముందుగఁ దానే నరకాసురుని జంపి ఖ్యాతివడయ నెంచును.

మొన్న రాత్రి మూడుగంటల వేళ బీదలు ధనికులు బాలురు వృద్ధులు, నందరు తమ తమ యిండ్లలో దీపములు వెలిగించుకొని కాచియుండిరి. అభ్యంగనములాడి కృత కౌతుక మంగళులై నరకుఁ డే నిమిష మేమూలనుండి వచ్చునోయని యస్త్రపా ణులై యెల్లవారు నెదురుచూచు చుండిరి. నరకాసు రుఁడిపుడు రాకుండినచో బాగుండునని తలఁచితిని. కాని బ్రహ్మవ్రాలు తప్పించుకొన నెవనితరము . నరకుఁడు విధిలేక రానేవచ్చెను. అబ్బా! ఏమి చెప్ప నాయుద్ధరంగ మహిమ! క్షణమున నూర్లకొలది - వేలకొలఁది - లక్షల కొలఁది-కోట్లకొలది, బాణము లొక్క పెట్టున నాకసమున నాట్యమాడ సాగెను ఆ కోలాహలము వర్ణనాతీతము! 'నేను ముందు 'నేను ముందను ధ్వనులు; పట్టు, విడువు, కాల్చుమను వీర ఘోషలు; హా, హూ, యను నాశ్చర్యారావములు; అయ్యో, తగిలెను. పొమ్ము, అను నార్తరవము లును లోకము నిండెను. బాణాగ్నులు జగమెల్ల నిండుకొనియె,