136
దీ పా వ ళి
22
ప్రపంచమున నెందఱు కూరులుండ లేదు. ఎందఱులోకకంటకులుదయమంది జనులకు మితిలేని బాధ లొనరింపలేదు? దురాచార పరాయణులగు రాక్షసరాజు లెందఱు జగమును హింసింపలేదు ? పతివ్రతల మానభంగము గావించి యేకర్మమెఱుఁ గని శిశువులు సయితము లక్షలకొలంది మారిమసగి నట్లు హతా హతముఁజేసి భరతమాత కనులకు నీరు దెచ్చిన నీచాతి నీచులు మన ప్రాచీన చరిత్రలో. నెందఱు గానరారు? కాని యిదేమీ కర్మమో నరకాసురునిపై మాత్రము మనవారికిఁ జెప్పరాని చలము గలదు! వానిపై నన్నచో మనవారు కాలు ద్రవ్వి జగడమునకు వెళ్ళుదురు.
రావణుఁడులేఁడా! హిరణ్యాక్ష హిరణ్యకశిపు లుండరా? సుందోప సుందులు సజ్జనులా? కంసుఁడు లోకమిత్రుఁడా? వీరిలో నొకరి జోలికయిన మన వారు పోరే! వీరికి తేరకుఁ జిక్కిసవాఁడెల్ల గ్రహము చాలని నరకాసురుఁడే! ఆబాలవృద్ధముగ సందఱకు నరకునిపై దండయాత్రయన్న పండుగ! ఎనిమిది దినములుగ నీ యుద్ధమునకై సన్నాహమే! ప్రతి మనుజుఁడును బాణసంచా సిద్ధముగ నుంచుకొనును;