123
మానిషాద ప్రతిష్ఠాంత్వ
మగమశ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిధునాదేక
మవధీః కామమోహితం
అను శ్రీమద్రామాయణ కావ్య మూల శ్లోకము వాగ్దేవి నెన్నుదుట కస్తూరి తిలకముగఁ బ్రకాశించుటఁ జూచి యబ్బుర పడితిని. భాగవత సూక్తి ముత్యాల ముంగరగ గన్పట్టెను. మృచ్ఛ కటికా నాగానందములు తాటంకయుగమై తళతళ మెరయుచుండె. భాస నాటకములు కర్ణ పూరములుగఁ గానవచ్చినవి. అభిజ్ఞాన శాకుంత- లము నాయకమణిగాఁ గాళిదాస కావ్యత్రయము వాగ్దేవికి గంఠాభరణముగ నొప్పుచుండినది. ఉత్తరరామచరిత్ర ముద్దుల ముక్తాహారముగఁ జూపట్టెను. రత్నావళి రత్నావళియే కిరాతార్జు నీయము కేయూరభావము వహించినది. భారత రామాయణ చంపూలు ముత్యాల మురుగులు గను, శిశుపాలవధ నైషధకావ్యములు మణి కంకణములుగను విరాజిల్లు చుండెను.హంస సందేశము ముద్దుటుంగర మయ్యెను. దశకుమార చరితము తళుకుకంచుకముగను, కాదంబరి కన కాంబరముగను దేవిని సేవించుచుండినవి. వాసవ