118
డొక్కఁడే! ఈదుర్గుణములు కలవాటుపడని మాన వులలోకమే లేదా? భగవంతుని సృష్టి కిది యసా - ధ్యమా? నిజముగ నట్లే కాఁబోల?
ఇట్లు తలపోసి తలపోసి “ఛీ! ఈ నీచ దే- హమును భరింపఁజాల! సర్వేశ్వరా! మంచి లోక మున నన్ను సృజింపఁ జాలనిచో నాకు మానవ దేహమేవలదు. కీట జన్మమైన నిమ్ము!" అని యుచ్ఛైస్స్వరమున నాడి, దభాలున నాతటాక మున దూకి మునిఁగిపోయెను.
నిజమరసినచో మనలో సదయులనేకులులేక పోలేదు. వీరే తనకు సర్వస్వమని నమ్ముకొనియున్న దారపుత్రాదుల కృతఘ్నత వలననో, మిత్రుల మోసము గారణముగనో; సుఖనాశము సంభవించి. నప్పుడు - అశా భంగ మావహిల్లి నపుడు ఉత్సా హ శక్తి యడుగంటి నపుడు - ఆనంద కళ యంత రించి నపుడు- మనుజునికి చుట్టునున్న ప్రపంచము పై ద్వేష మొదవు టేమియరుదు? “అనాశ్వా- సీత దుఃఖితే సర్వ మసహ్యమనా నెఱుంగవే?” యను నానుడిఁ బరికింపుడు.
కాని సదయుని స్థితి యేమయినదియు కను గొందము. చదువరులు కొంత కాలము వేచి యుందురు గాత!