Jump to content

పుట:వదరుబోతు.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

115

ర్థపరత్వము దప్ప వేఱు గానవచ్చుటే లేదు.

నీచాతి నీచమగు మనుష్య మృగమునకు నివాస యోగ్యములగు పట్టణము లందుండ రాదని యెంచి సదయుడు, విలాసధామమును విడచి యొక్కడు నొక్క ఘోర కాంతారముఁ జేరెను. అచటి పక్షులు మృగములు నతనికి స్వాగత మిచ్చినట్లుండె. అందలి పచ్చికయు, రమ్యములగు ఫలపుష్పములచే నిండిన తరు లతాదులును, జల జలమని నిర్మలోదకముల ప్రవహించు సెలయే- ళ్ళును జూచి యతని మనసు చల్లబడియెను. మానవ హృదయముల కన్న నచటి గండశిలలు కోమలములని తోచెను. స్తుతి పాఠకుల ప్రసంగ ములకన్న సింహ శార్దూలాదుల గర్జారవములు మధురములయ్యె. మిత్రుల ప్రశంసా వాక్యములలో నున్నంత విషము పాములు కోరలలోఁ గూడ నతనికి గానవచ్చినదికాదు. క్రమముగ మనుజుని వేషము గూడ నాతనికిఁ గిట్టలేదు. నీచుడఁగు మనుష్యునిఁ దలఁపునకుఁ దెచ్చునని, మనుష్య ద్వేష మాతనిని వస్త్రములను విప్పివైచి దిగంబరుఁడు గాఁ దిరుగు. నటు చేసినది.

చలి కాలము వచ్చెను. సదయుఁడు శాంత.. ముతో చలి బాధను సహించె. మనుజులవలె