Jump to content

పుట:వదరుబోతు.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

నీచబుద్ధి దుస్ససేనుఁడు ద్రౌపది నవమానించి మమ్ము వట్టి నిష్కరుణుఁడై సభకీడ్చి కాసినెట్టిన కారణమున నాప్రచండమానిని పాంచాలి మాకై దీక్షవహించి యెన్ని యోపాట్లకోర్చి పట్టువట్టి తుద కానీచుఁడు భీమసేనునకుం జిక్కి నిర్ఘాతపాతముం బోలు నతని ఘోరగదాహతిపాలయి నేలఁ గూలి నపుడా పాపి హృదయమందలి రక్త ధారలచే మా కవబృథస్నానము గావించి పగసాధించిన క్షణ మునుదలంచిన మావంశము వారందఱును నేఁడు గూడ మహోత్సవమున నిక్కకమానరు. కాని యివన్నియు దేవరయెఱుంగని యంశములు కావు.

కాల మొక్క తీరుగ నుండ రాదు కాఁబోలు! ప్రాచీనౌన్నత్యమహిమ యెంతయైననేమి! రాను నాను కాలమునకుం జిక్కి మా యోగ్యత తెల్ల వారసాగెను. అకారణముగ మాపై గొందరకు ద్వేషబుద్ధి యొదవెను. మహమ్మదీయులు జైనులు మున్నగువారు మతము పేరు పెట్టి మమ్మునిర్దయతో. ఖండింప మొదలిడిరి. ఎవరు నిరాదరించిన నే- మాయె, మా యార్య సంతతియైన మమ్ము చేవిడు వదుగదాయని కొండను బలె నమ్ముకొని కొంతలో గొంత నెమ్మది పఱచుకొని కాలము గడుపుచుం టిమి. కాని మహాశయా! క్షమింతురుగాక!