Jump to content

పుట:వదరుబోతు.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

101

తలతో నడచుచుండిరి. సదా స్నేహమున బోషించిరి. పూలతోఁ బూజించిరి. వారినుండి మా పడసిన మన్ననలకై వారిని మేమెంత కొని యాడిననుఁ దీరదు ఎన్ని కష్టములు వారనుభవింప వలసి వచ్చిననేమి, మాకేమాత్రమును చిక్కులు రానీక వారు జాగరూకతతో మెలఁగుచుండిరి. వారు నిరాహారులై నపుడు సయితము మాకు సదా హారముల కేకొఱఁతయు రాదు. సఖీరత పరి వృతయై ప్రాసాదమున యువరాజ్యభోగము లను భవించు దినములలో మల్లెలు సంపెగలతో మమ్మ లంకరించుట పోనిండు, పతిమాత్ర సహాయయై ప్రభుత్వభోగములఁ బాసి ప్రవాసకష్టముల నను భవించుచు దండకారణ్య సీమలలోఁ దిరుగు వేళ గూడ, జానకి కళివిపూవులో, గోరంట కుసుమ ములో, గోదావరిలోని తామరములో తెచ్చియైన మాకర్పించుచుండెనేకాని మాయెడ నిరాదరము చూపినది కాదు. సవతియెడ మత్సరమూని సత్య భౌమ పతిపై నలిగి పన్నాగము లెన్నియో పన్ని కడకు మహేంద్రుని యుపవనమునుండి పారిజాత వృక్షమునే పెకళించి తెచ్చి పెరటితోఁటలో నాటింపఁజేయుట మాకైకదా? అంతయేల? మా ప్రసంగములేకున్నచో భారతకథయునునిస్సారమే!