100
నాయభిప్రాయ మిచ్చుటకన్న దానినే చదువరుల కర్పించుట యెక్కుడు హితమని తలంచుచున్నాఁడు అందిట్లు వ్రాయబడియుండె:-
"ఆర్యా! సాంఘిక గుణదోషములు విమ ర్శించుటయు, అగతికులు కాశ్రయమిచ్చుటయును దేవర నైజగుణములని చాల కాలముగ వినుటచే నేఁడీ విన్నపమును వ్రాసి తమ కొంత తొందర గల్పింప సాహసించితిమి.
మహాత్మా! మాజన్మభూమి యుత్తమాంగ దేశము. కుండలసీమలో నేఁటికిని మా పెట్టినదే పేరు. మార్దవ కోమలత్వాది సుగుణములు మా వంశమున కుగ్గుపాలతోఁగూడ వచ్చినవి. సౌందర్య. మునకు ముల్లోకములలోను మా పెట్టినదే భిక్ష దోషైకదృష్టిగల కవులు గొండఱు మాయెడఁ గౌటిల్యమును గోరంత కొండంత వర్ణించిరి కాని, దానిచే నితరుల కెవరికి నెట్టి యిక్కట్టునుం గల్గమి యటుండ మాకును మముఁ బోషించువారికింగూడ నది సౌందర్యాతిశయమునే గూర్పుటం జేసి యది గుణముగనే సమర్థింపగలము.
కాననే తరతరములనుండియు మీపూర్వులు స్త్రీలనక పురుషులనక, సర్వులును మమ్ము విశేష ముగ గారవించుచుండిరి. మా మాటయన్న