ఈ పుట ఆమోదించబడ్డది
99
భరణములను మార్చుచుండును. కాని యామె నెవ్వరును రూపవతి యన్న పుణ్యముఁగట్టుకొన్నవారు లేరు. అవభ్యాసము వలన నామె సంగీతము పసయుఁ దగ్గిపోయెను.ఇందిర గానమును మెచ్చుకొన్నవారును లేరు. నిరంతరమును సంగీత పరిశ్రమకుఁ జిక్కి యామె తలయందలి పేలను గూడ సరకుఁగొనదు.
మనకు స్వభావసిద్ధమైన యభిరుచిని వదలినచో సహజశక్తిని బోగోట్టుకొని యసమర్థులమగుటేకాక, యితరవిషయముల నశ్రద్ధఁ జూపుటంజేసి తగిన గౌరవమును సయితము గోలుపోయి ప్రపంచమున నయోగ్యుల మనిపించుకొందుము.
If men would be content to graft upon nature, and assist her operations, what mighty effects might we expect?
--ADDISION.
కురుల మొఱ
17
నేడు నాకార్యస్థానమున కరిగినంత బల్లపై నా చిరునామాగల జాబొండు కానవచ్చెను. అది యొక చిత్రమైన లేఖ. అందలి యంశములపై