ఈ పుట ఆమోదించబడ్డది
88
డదో ఎవరురాఁగలరని స్వప్నమునందైన దాము నమ్మరో అట్టివారికెల్ల నిష్ప్రయోజనముగ నీప్రకటనలఁ బంపుట కంటె మిన్నకుండుటయే గౌరవమని నాతలంపు. నిరర్ధకముగ నీ కఱవు దినములలోఁ గాగితమును పాడు సేయ కుండుటే గాక యిందుకై వ్యయమగు ధనమును వేఱు మంచిపనుల కుపయోగించు కొనఁగల్గుటచే వారికిని వారిదేశమునకును గొంత క్షేమమే!
పోనిండు. అయిదారు దినములలోఁ జెన్నపురినుండి నామిత్రుఁడొక జాబు వ్రాసెను. దానిని వచ్చు సారి ప్రకటించెదను.
ఆచార్యుని కన్న అనుభవము మేలు
15
చెన్నపురినుండి నామిత్రుఁడు వ్రాసిన లేఖయిది:-
“పుష్పక విమానము”
"చెన్నపురి"
“వైశాఖ బ. షష్ఠి”.
"ఆర్యా! పెద్దలమాట వినక దుర్యోధనుఁడును మిత్రుల యుపదేశము నాదరింపక రావణుఁడును