పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయం కలిగింది. లండన్‍లో తెలుగు వారికి గొప్ప వేదిక లండన్ తెలుగు సంఘం. లండన్‍లో పరిచయమైన శ్రీమతి వింజమూరి రాగసుధ నర్తకీమణి, మంచి కవయిత్రి. లండన్ తెలుగు సంఘంలో చురుకైన పాత్ర వహిస్తున్నారు.

మేడమ్ తుస్సాడ్స్ :

డాక్టర్ లక్ష్మీప్రసాద్‍తో కలిసి లండన్‍లో ముఖ్యప్రదేశాలు సందర్శించాను. అంతర్జాతీయ ప్రముఖుల మైనపు బొమ్మాలతో కూడిన మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం నన్నెంతో ఆకర్షించింది. అక్కడ కొలువు తీరిన ప్రముఖుల బొమ్మలు 'సజీవ మూర్తులు' అని భ్రమింపచేస్తాయి. మహాత్మాగాంధీ, సచిన్ టెండూల్కర్, సల్మాన్‍ఖాన్ బొమ్మలు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ కనిపించాయి. ఆ ప్రతిమలతో ఫోటో దిగితే వాటిని చూసిన వారు నిజంగానే ఆ ప్రముఖులను కలసి తీసుకున్నారేమోనని తప్పక భ్రమిస్తారు.

మేడమ్ తుస్సాడ్స్ (1761-1850) ఫ్రాన్స్‍లోని స్ట్రాబర్గ్‍లో జన్మించారు. మాడలింగ్‍లో ప్రఖ్యాతిగాంచిన డా॥ ఫిలిప్పి కర్టియస్ వద్ద ఈమె తల్లి హౌస్ కీపర్‍గా పనిచేసేది. కర్టియస్ వద్దనే తుస్సాడ్స్ మైనపు బొమ్మలు చేయడం నేర్చుకున్నారు. ఈమె తయారు చేసిన మైనపు బొమ్మలు అనతికాలంలోనే మంచి ప్రాచుర్యం పొంది ఈమెకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. తుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం లండన్‍లో ఒక గొప్ప సందర్శన స్థలం. ఇప్పడు ఈ మ్యూజియానికి ప్రపంచంలో ఎన్నో చోట్ల బ్రాంచిలు కూడా ఉన్నాయి.

ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ రీయూనియన్ :

కొవెంట్రిలో ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ రీ యూనియన్ 2009 మే 2,3 తేదీలలో డా॥ సుబ్బారావు వి. చదలవాడ, డా॥ రమేష్ పొట్లూరి ఆధ్వర్యంలో జయప్రదంగ జరిగింది. నాలుగైదు వందలమంది తెలుగు వైద్యులు ఈ సమ్మేళనంలో పాలు పంచుకున్నారు. చాలామంది బంధుమిత్రులను అనుకోకుండా అక్కడ కలిసే అవకాశం కలిగింది. మా