Jump to content

పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు జాతి పక్షాన, ప్రత్యేకించి కృష్ణా గోదావరి డెల్లా వాసుల పక్షాన శ్రద్ధాంజలి ఘటించినందుకు ఆనందించాము.

రాబర్ట్ చార్లెస్ కాటన్ రాష్ట్ర పర్యటన

మేము లండన్ పర్యటన ముగించుకుని తిరిగివచ్చిన తరువాత కాటన్ సమాధి సందర్శన గురించి పత్రికలలో వార్తలు చూసిన ముఖ్యమంత్రి డా॥ వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు మమ్మలను పిలిపించి కాటన్ వారసులెవరైనా ఉంటే వారిని మన రాష్ట్రానికి ఆహ్వానించి సత్కరిద్దామని చెప్పారు.

కాటన్ శత వర్ధంతి సందర్భంగా కాటన్ మునిమనుమడు ఛార్లెస్ రాబర్ట్ కాటన్ మన రాష్ట్రానికి వచ్చినట్లు గుర్తు. అయితే వారి చిరునామా మాకు లభ్యం కాలేదు. డా॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పట్టువదలని విక్రమార్ముడిలా ఇంగ్లాండులోని ఒక ప్రైవేటు ఏజన్సీ ద్వారా చార్లెస్ రాబర్ట్ కాటన్ చిరునామా సేకరించి మరలా ఇంగ్లాండు వెళ్లి హెన్లీ-ఆన్ -థీమ్స్‌లో వారి నివాసంలో కలసి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారి ఆహ్వానాన్ని అందజేశారు.

సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తిగ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజక్టుల నిర్మాణానికి "జలయజ్ఞం" ప్రారంభించారు రాజశేఖరరెడ్డిగారు.

బృహత్తరమైన జలయజ్ఞాన్ని ప్రారంభించిన డా॥ రాజశేఖరరెడ్డిని కొనియాడుతూ భారత ప్రధాని డా॥ మన్మోహన్ సింగ్ 'అభినవ కాటన్"గా అభివర్ణించారు. రాబర్ట్ సి. కాటన్‌ని ఆహ్వానిస్తూ జులై 29, 2009న డా॥ రాజశేఖరరెడ్డిగారు వ్రాసిన లేఖ ఈవిధంగా ఉంది.

ప్రియమైన కాటన్ గారికి, ప్రఖ్యాత ఇంజనీరు స్వర్టీయ సర్ ఆర్థర్ కాటన్‌గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయదారులకు వరప్రసాదం లాంటి నీటి

73